చెన్నై వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బెయిల్-స్విచ్ ట్రిక్ ఉపయోగించాడు. వికెట్ రాని సమయంలో ఫీల్డింగ్ టీం ఈ ట్రిక్ ఉపయోగిస్తే వికెట్ పడుతుందనే సెంటిమెంట్ ఉంది. బెయిల్-స్విచ్ అంటే స్టంప్స్ మీద ఉన్న రెండు బెయిల్స్ మారుస్తారు. కొన్ని సందర్భాల్లో ఇది ఫలించడంతో ఈ ట్రిక్ బాగా ఫేమస్ అయింది. తాజాగా రోహిత్ ఈ బెయిల్-స్విచ్ ట్రిక్ సెంటిమెంట్ ఫాలో అయ్యాడు.
నాలుగో రోజు ఆటలో భాగంగా బంగ్లాదేశ్ కెప్టెన్ శాంటో.. షకీబ్ అల్ హసన్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 12 ఓవర్ల పాటు భారత బౌలర్లకు వికెట్ ఇవ్వలేదు. ఈ క్రమంలో రోహిత్ బౌలింగ్ ఎండ్ వద్ద బెయిల్స్ ను మార్చాడు. అయితే అనుకున్న ఫలితం మాత్రం ఇవ్వలేదు. ఈ ట్రిక్ ను తొలిసారి ఇంగ్లాండ్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ ప్రయోగించగా.. ఇది విజయవంతమైంది. బెయిల్స్ ను మార్చిన తర్వాత ఓవర్లో మార్క్ వుడ్ బౌలింగ్ లో ఆస్ట్రేలియా ఆటగాడు మార్నస్ లబుషేన్.. రూట్ కు స్లిప్ లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
Also Read:-చెస్ ఒలింపియాడ్‌లో ఇండియా డబుల్ ధమాకా
రోహిత్ ఆశించినట్టు వెంటనే వికెట్ పడకపోయినా.. 48 పరుగుల వద్ద వీరిద్దరి భాగస్వామ్యానికి తెర పడింది. ఆ తర్వాత చివర్లో జడేజా చక చక వికెట్లు తీస్తూ బంగ్లా లోయర్ ఆర్డర్ ను పెవిలియన్ కు పంపాడు. దీంతో భారత్ తొలి టెస్టులో 280 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ లో విఫలమైన రోహిత్.. కెప్టెన్ గా తన జైత్రయాత్రను కొనసాగిస్తున్నాడు. కెప్టెన్సీ చేపట్టిన తర్వాత ఇప్పటివరకు ఒక్క సిరీస్ కూడా ఓడిపోని కెప్టెన్ గా దూసుకెళ్తున్నాడు.
Rohit Sharma doing the bails change trick during the match 😂pic.twitter.com/KARNCMgaEn
— CricWatcher (@CricWatcher11) September 22, 2024