T20 World Cup 2024: రోహిత్‌ను నమ్మలేం.. నాకౌట్స్‌లో భయపెడుతున్న హిట్ మ్యాన్ చెత్త రికార్డ్

T20 World Cup 2024: రోహిత్‌ను నమ్మలేం.. నాకౌట్స్‌లో భయపెడుతున్న హిట్ మ్యాన్ చెత్త రికార్డ్

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన ప్లేయర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అతను క్రీజ్ లో ఉంటే పరుగుల వర్షం కురుస్తుంది. కుదురుకున్నాడంటే ప్రత్యర్థులకు చుక్కలు కనబడాల్సిందే. ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్ లో హిట్ మ్యాన్ రికార్డ్ అమోఘం. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లోనూ బ్యాటింగ్ లో సత్తా చాటుతున్నాడు. ఇంతవరకు ఓకే అయినా ఒక విషయంలో మాత్రం రోహిత్ శర్మ టీమిండియాను ముంచేస్తున్నాడు. కీలకమైన ఐసీసీ నాకౌట్స్ లో తేలిపోతున్నాడు. ఈ విషయమే ఫ్యాన్స్ ను కంగారు పెడుతుంది. 

టీ20 వరల్డ్ కప్ సెమీస్ లో భాగంగా గురువారం (జూన్ 27) ఇంగ్లాండ్ తో భారత్ సెమీ ఫైనల్ ఆడనుంది. వెస్టిండీస్ లోని గయానా ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తుంది. పటిష్టమైన ఇంగ్లాండ్ ను ఓడించాలంటే భారత్ శక్తికి మించి ఆడాల్సిందే. కోహ్లీ ఫామ్ లో లేనందున ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ పైనే ఆశలు పెట్టుకున్నారు. అయితే ఐసీసీ నాకౌట్స్ లో ఇప్పటివరకు రోహిత్ ఒక్క హాఫ్ సెంచరీ చేయకపోవడం విశేషం. ఫార్మాట్ ఏదైనా హిట్ మ్యాన్ కీలకమైన సెమీస్, ఫైనల్లో చేతులెత్తేస్తున్నాడు. ఒత్తిడిని తట్టులోలేక కుదేలైపోతున్నాడు. 

2015, 2019 వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్ లో విఫలమయ్యాడు. భారత్ వేదికగా జరిగిన 2023 వరల్డ్ కప్ సెమీస్ లోనూ వేగంగా ఆడే క్రమంలో తక్కువ స్కోర్ కే ఔటయ్యాడు. 2014, 2016, 2022 పర్వాలేదనిపించినా స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. సాధారణ మ్యాచ్ ల్లో అసాధారణ ఇన్నింగ్స్ లతో చెలరేగే రోహిత్ కీలక మ్యాచ్ ల్లో తన మార్క్ చూపించలేకపోతున్నాడు. సూపర్-8 లో ఆస్ట్రేలియాపై 92 పరుగులు చేసి వార్ వన్ సైడ్ చేశాడు. ఇదే ఇన్నింగ్స్ సెమీస్ లో ఇంగ్లాండ్ పై ఆడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి ఈ సారైనా రోహిత్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడతాడో లేదో చూడాలి.