భారత క్రికెటర్, జాతీయ క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ పుట్టినరోజు నేడు. మంగళవారం(ఏప్రిల్ 30)తో హిట్‌మ్యాన్ 36 ఏళ్లు పూర్తి చేసుకొని.. 37వ వసంతంలోకి అడుగుటపెట్టాడు. ఈ క్రమంలో అతనికి విషెష్ వెల్లువెత్తుతున్నాయి. సహచర క్రికెటర్లు, క్రీడా ప్రముఖులు, అభిమానులు అతనికి సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నారు. ఇక, అతని వీరాభిమానులు ఒక అడుగు ముందుకేసి.. ఆకలితో అలమటిస్తున్న పేదవారికి తమ వంతు సాయం చేస్తున్నారు. తమ అభిమాన క్రికెటర్ పుట్టినరోజు సంధర్భంగా పేదల కడుపు నింపారు.
ఆల్ కర్నాటక రోహిత్ శర్మ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు బెంగళూరులోని పలు ప్రాంతాల్లో పేదలకు ఆహారాన్ని పంపిణీ చేశారు. రోహిత్ పేరుతో కేక్ కట్ చేయడం, ప్రజలకు ఆహార ప్యాకెట్లను పంపిణీ చేస్తున్న పలు ఫోటోలను వారు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఐపీఎల్ ప్రాంఛైజీ ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ సైతం ముంబై నగర వీధుల్లో ఆహారాన్ని పంపిణీ చేశారు. అతని పుట్టినరోజు సంధర్భంగా అక్కడక్కడ త్రాగు నీటి వసతి ఏర్పాటు చేశారు.
On behalf of All Karnataka Rohit Sharma Fans Association, food was distributed to the children, elders and streets of Bengaluru as part of our beloved Idol Rohit Sharma's birthday. @ImRo45 🙏🏻💙#HappyBirthdayRohit pic.twitter.com/V0xSEvKIXP
— ALL KARNATAKA ROHIT SHARMA FANS ASSOCIATION (@AKARSFA) April 30, 2024
హిట్‌మ్యాన్ క్రికెట్ ప్రయాణం
జట్టులో చోటే కష్టమైన దశ నుంచి జట్టునే నడిపించిన స్థాయికి ఎదిగిన రోహిత్ ప్రయాణం.. ఈ తరం క్రికెటర్లకు స్ఫూర్తి దాయకం. 2007లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన హిట్‌మ్యాన్ తన ఆటతీరు, అత్యుత్తమ ప్రదర్శనలతో అంతర్జాతీయ క్రికెట్‌పై తనదైన ముద్ర వేశాడు. కెరీర్ తొలినాళ్లలో 6, 7 స్థానాల్లో బ్యాటింగ్ కు వచ్చే రోహిత్.. 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. అక్కడినుంచి అతను వెనుదిరిగి చూడలేదు. విధ్వంసకర బ్యాటింగ్‌తో ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ లో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక అటగాడు. సింగిల్స్ తీసినంత ఈజీగా సిక్సర్లు కొట్టగల సమర్థుడు.. అందువల్లే హిట్‌మ్యాన్ అనే బిరుదు.
- 472 అంతర్జాతీయ మ్యాచులు..
- 18, 820 పరుగులు..
- 48 సెంచరీలు..
- 101 హాఫ్ సెంచరీలు..
- టెస్టుల్లో అత్యధిక స్కోరు.. 212
- వన్డేల్లో అత్యధిక స్కోరు.. 264
- టీ20ల్లో అత్యధిక స్కోరు.. 101 నాటౌట్
- వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడు.
4️⃣7⃣2⃣ intl. matches
— BCCI (@BCCI) April 30, 2024
1️⃣8⃣,8⃣2⃣0⃣ intl. runs
4️⃣8⃣ intl. hundreds 💯
Only cricketer to score Three ODI double hundreds 🫡🫡
Wishing a very Happy Birthday to #TeamIndia Captain Rohit Sharma! 🎂@ImRo45 pic.twitter.com/fZD7uwcG3C