ఐపీఎల్ లో భాగంగా నేడు మరో మ్యాచ్ అభిమానులను అలరించేందుకు సిద్ధంగా ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ తో ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకోనుంది. హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తుంది. తొలి మ్యాచ్ లో ఓడిపోయిన ఇరు జట్లు నేడు జరిగే మ్యాచ్ లో గెలిచి బోణీ కొట్టాలని చూస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ సన్ రైజర్స్ బ్యాటర్ మయాంక్ అగర్వాల్ ను ఆటపట్టించాడు.
ప్రాక్టీస్ సమయంలో మయాంక్ అగర్వాల్ వద్దకు వెళ్లిన రోహిత్ శర్మ.. అతని ప్లయింగ్ కిస్ ఇచ్చాడు. ఇందులో పెద్దగా ఆశ్చర్యం లేకపోయినా.. ఈ సంఘటన అచ్చం హర్షిత్ రానా ఇచ్చిన విధంగా ప్లయింగ్ కిస్ లా ఉంది. దీంతో రోహిత్ కావాలనే మయాంక్ ను టీజ్ చేశాడని అర్ధమవుతుంది. రోహిత్ సరదాగా చేసిన ఈ టీజింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. హిట్ మ్యాన్ నుంచి ఇలాంటి యాంగిల్ అసలు ఊహించలేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read :ఐపీఎల్ మ్యాచ్.. ఉప్పల్ రూట్లో మెట్రో టైమింగ్ పొడిగింపు
ఐపీఎల్ లో భాగంగా మార్చి 23న కోల్‌కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ కేకేఆర్ బౌలర్ హర్షిత్ రానా ఎస్ఆర్ హెచ్ బ్యాటర్ మయాంక్ అగర్వాల్ ను ఔట్ చేసిన తర్వాత హర్షిత్ రానా..అతని వద్దకు వెళ్లి ప్లయింగ్ కిస్ ఇస్తూ పెవిలియన్ వైపు వెళ్లాలని సూచించాడు. దీంతో మయాంక్ అతని వైపు కోపంగా చూశాడు. ఇలా చేయడం ఐపీఎల్ నిబంధనలకు విరుద్దం అంటూ నిర్వాహకులు హర్షిత్ రానాకు మ్యాచ్ ఫీజులో 60శాతం కోత విధించారు.
This side of Rohit Sharma 🥰pic.twitter.com/tb32Pq15Jx
— VECTOR⁴⁵ (@Vector_45R) March 27, 2024