Rohit Sharma: ఆ ఇద్దరికీ ఎప్పుడూ సపోర్ట్ ఉంటుంది.. ఫ్యూచర్ స్టార్స్ ఎవరో చెప్పిన రోహిత్

Rohit Sharma: ఆ ఇద్దరికీ ఎప్పుడూ సపోర్ట్ ఉంటుంది.. ఫ్యూచర్ స్టార్స్ ఎవరో చెప్పిన రోహిత్

టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ 9 నెలల్లో రెండు ఐసీసీ ట్రోఫీలు గెలిచింది. 2023 వన్డే వరల్డ్ కప్ తర్వాత నాకౌట్ లో ఓడిపోతారనే విమర్శలు ఉన్నప్పటికీ భారత్ వాటన్నిటినీ తిప్పికొట్టింది. గత ఏడాది జూన్ లో వెస్టిండీస్ గడ్డపై టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా.. తాజాగా దుబాయ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది. రెండు టోర్నీల్లో కూడా ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా టైటిల్ గెలవడం విశేషం. జట్టులో అనుభవ ఆటగాళ్లు రోహిత్, కోహ్లీ, జడేజా ఉన్న కారణంగానే భారత్ టైటిళ్లు సాధించగలిగింది. అయితే ఫైనల్ లో విజయం తర్వాత ఒక ఇంటర్వ్యూలో  రోహిత్ మాట్లాడుతూ భారత క్రికెట్ భవిష్యత్ కూడా చాలా సేఫ్ గా ఉందనే భరోసా ఇచ్చాడు. 

యంగ్ క్రికెటర్ల సామర్ధ్యం గురించి మాట్లాడుతూ భారత జట్టుకు చాలా బెంచ్ స్ట్రెంత్ ఉందని చెప్పాడు. ఈ సందర్భంగా భారత జట్టు ఫ్యూచర్ స్టార్స్ ఎవరనే విషయాన్ని వెల్లడించాడు. "కొంతమంది ఆటగాళ్ళు ఇప్పటికే జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్నారు. బెంచ్ స్ట్రెంత్‌ కూడా భవిష్యత్తులో బలంగా ఉంటుంది. భవిష్యత్తులో భారత జట్టు చాలా బలంగా ఉంటుందని ఖచ్చితంగా చెప్పగలను.  జట్టును ముందుకు తీసుకెళ్లడానికి శుభ్‌మాన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ వంటి వారికి ఎప్పుడూ సపోర్ట్ ఉంటుంది". అని రోహిత్ ఫైనల్ తర్వాత ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. 

Also Read :- రచీన్ రవీంద్రకే గోల్డెన్ బ్యాట్

స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సైతం రాబోయే 8 సంవత్సరాలలో భారత జట్టు చాలా బలంగా ఉంటుందని.. నేను రిటైర్ అయ్యే సమయానికి జట్టు సేఫ్ గా ఉంటుందని ఫైనల్ తర్వాత చెప్పాడు. 2026 టీ20 వరల్డ్ కప్ భారత జట్టు కోహ్లీ, రోహిత్, జడేజా లేకుండా ఆడబోతుంది. స్వదేశంలో జరగనున్న ఈ టోర్నీలో టీమిండియాపై భారీ అంచనాలు ఉన్నాయి. సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీలో భారత యువ క్రికెటర్లు సూపర్ ఫామ్ లో ఉన్నారు. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, శుభమాన్ గిల్, యశస్వి జైశ్వాల్,మయాంక్ యాదవ్, అర్షదీప్ సింగ్, వాషింగ్ టన్ సుందర్, శ్రేయాస్ అయ్యర్ జట్టును ముందుకు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు.