టీమిండియా ప్రస్తుతం వరుస విజయాలు సాధిస్తున్న స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య గాయం అభిమానులని ఆందోళనకి గురి చేస్తుంది. బంగ్లాతో మ్యాచ్ సందర్భంగా కాలు మెలిపెట్టేయడంతో నొప్పితో విలవిల్లాడిన పాండ్య ఈ మ్యాచులో ఆడలేదు. ఈ మ్యాచ్ తర్వాత హార్దిక్ స్కానింగ్ కి వెళ్లినట్లు తెలుస్తుంది. దీంతో గాయం తీవ్రత ఎలా ఉందనే విషయంపై ఇప్పటివరకు ఒక అంచనా లేదు. తాజాగా కెప్టెన్ రోహిత్ శర్మ హార్దిక్ పాండ్య గాయం గురించి అప్ డేట్ ఇచ్చేసాడు.
బంగ్లాపై మ్యాచ్ అనంతరం రోహిత్ మాట్లాడుతూ "హార్దిక్ పాండ్యా ప్రస్తుతం నొప్పితో బాధపడుతున్నాడు. అయితే ఈ గాయం గురించి పెద్దగా ఆందోలన పడాల్సిన అవసరం లేదు. టీమిండియాకు ఇది గుడ్ న్యూస్. అయితే హార్దిక్ గాయం నేపథ్యంలో తదుపరి మ్యాచ్‌కు అనుసరించాల్సిన వ్యూహాలపై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇది ప్రపంచకప్ కాబట్టి ముందు జాగ్రత్త అవసరం’ అని హిట్ మ్యాన్ తెలిపాడు.
ప్రస్తుతం హార్దిక్ గాయం నుంచి కోలుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో రేపు(అక్టోబర్ 22) వరల్డ్ కప్ లో న్యూజీలాండ్ తో మ్యాచుకు దూరం కానున్నాడు. అయితే ఆ తర్వాత భారత్ ఆడబోయే ఇంగ్లాండ్ మ్యాచుకు మాత్రం అందుబాటులో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కివీస్ తో మ్యాచ్ తర్వాత వారం రోజుల సమయం ఉంది. రోహిత్ చెప్పిన వ్యాఖ్యలను చూస్తుంటే హార్దిక్ ఈ వారం రోజుల్లో త్వరగా కోలుకుని జట్టులోకి రావాలని అభిమానులు ఆశిస్తున్నారు.