టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన మతి మెరుపుతో మరోసారి ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం పాకిస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ వేయడానికి వచ్చిన రోహిత్ శర్మ, బాబర్ అజామ్ వచ్చారు. ఈ దశలో మ్యాచ్ రిఫరీ హిట్ మ్యాన్ ను టాస్ వేయాల్సిందిగా కోరాడు. అయితే అప్పటికే కాయిన్ ను తన జేబులో పెట్టుకున్న హిట్ మ్యాన్.. కాయిన్ ఇవ్వాల్సిందిగా రిఫరీని కోరాడు. కాయిన్ నీ దగ్గరే ఉందని రిఫరీ, బాబర్ అజమ్ రోహిత్ కు గుర్తు చేయగా.. ఇండియన్ కెప్టెన్ వెంటనే కాయిన్ తన జేబులోని ఉందని గుర్తించాడు. దీంతో కాసేపు టాస్ సమయంలో నవ్వులు విరిశాయి.
బాబర్ అజామ్, మ్యాచ్ రిఫరీతో పాటు అక్కడే ఉన్న రవిశాస్త్రి నవ్వుకున్నారు. టాస్ సమయంలో రోహిత్ కు ఇలాంటివి కొత్తేమి కాదు. ఇదే వరల్డ్ కప్ మ్యాచ్ లో భాగంగా ఐర్లాండ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో టీమిండియా స్క్వాడ్ ను చెప్పడం మర్చిపోయాడు. ఇక న్యూయార్క్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ విషయానికి వస్తే పాకిస్థాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించడంతో టాస్ 8 గంటలకు వేశారు. ఇక మరోసారి వర్షం పడడంతో మ్యాచ్ 8:30 కు ప్రారంభమవ్వాల్సిన మ్యాచ్ 8:50 కు ప్రారంభమయింది.
భారత్ (ప్లేయింగ్ XI):
రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్
పాకిస్థాన్ (ప్లేయింగ్ XI):
మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), బాబర్ ఆజం(కెప్టెన్), ఉస్మాన్ ఖాన్, ఫఖర్ జమాన్, షాదాబ్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఇమాద్ వసీం, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్, నసీమ్ షా, మహ్మద్ అమీర్
Rohit Sharma moment during toss time. 😄🔥 pic.twitter.com/6oAIATQ5wi
— Johns. (@CricCrazyJohns) June 9, 2024