Cricket World Cup 2023: చరిత్ర సృష్టించిన భారత బ్యాటర్లు.. ఆల్‍టైం సెంచరీల్లో తొలి మూడు స్థానాలు మనవే

Cricket World Cup 2023: చరిత్ర సృష్టించిన భారత బ్యాటర్లు.. ఆల్‍టైం సెంచరీల్లో తొలి మూడు స్థానాలు మనవే

సెంచరీలు ఎలా చేయాలో భారత బ్యాటర్లకు తెలిసినంతగా మరెవరికీ తెలియదేమో. ముఖ్యంగా వన్డేల్లో మన బ్యాటర్లు అలవోకగా సెంచరీలు బాదేస్తారనే పేరుంది. సచిన్, విరాట్ కోహ్లీ అనుకుంటే రోహిత్ శర్మ వీళ్ళకి తక్కువ కాదు అనేట్లుగా గట్టి పోటీనిస్తున్నాడు. వరల్డ్ కప్ లో భాగంగా నిన్న (అక్టోబర్ 11) ఆఫ్ఘనిస్తాన్ మ్యాచులో సెంచరీతో చెలరేగిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ల లిస్టులో టాప్-3 లో నిలిచాడు. 

మొన్నటివరకు 30 సెంచరీలు చేసి ఆసీస్ మాజీ స్టార్ బ్యాటర్ రికీ పాంటింగ్ తో సంయుక్తంగా మూడో స్థానంలో కొనసాగిన హిట్ మ్యాన్.. తాజాగా ఆఫ్గాన్ మీద సెంచరీ చేయడంతో అధికారికంగా మూడో స్థానంలోకి వచ్చేసాడు. ఈ లిస్టులో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ 49 సెంచరీలతో అగ్ర స్థానంలో ఉండగా.. కింగ్ విరాట్ కోహ్లీ 47 సెంచరీలతో రెండో స్థానంలో నిలిచాడు. దీంతో వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన లిస్టులో తొలి మూడు స్థానాల్లో భారత ప్లేయర్లే ఉండడం విశేషం.

Also Read :- విరాట్ చేసిన పనికి నెటిజన్స్ ఫిదా
 

ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లలో ఎవ్వరూ కూడా కనీసం 20 సెంచరీలు కూడా చేయకపోవడంతో ఈ రికార్డ్ చాలా కాలం వరకు బ్రేక్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఈ ముగ్గురిలో ప్రస్తుతం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వన్డేల్లో కొనసాగుతుండడంతో మరిన్ని సెంచరీలు వీరు తమ ఖాతాలో వేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.                    

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by CricTracker (@crictracker)