రాంచీ టెస్టులో భారత్ విజయం ఖారరైనట్టుగానే కనిపిస్తుంది. 192 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా విజయం దిశగా దూసుకెళ్తుంది. రోహిత్ శర్మ అజేయ హాఫ్ సెంచరీతో ప్రస్తుతం భారత్ వికెట్ నష్టానికి 93 పరుగులు చేసింది. భారత్ గెలవాలంటే మరో 99 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజ్ లో రోహిత్ (52) గిల్ (4) ఉన్నారు. 37 పరుగులు చేసిన జైశ్వాల్ రూట్ బౌలింగ్ లో ఔటయ్యాడు.
వికెట్ నష్టానికి 40 పరుగులతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన భారత్ దూకుడుగా ఆడింది. తొలి వికెట్ కు 84 పరుగులు జోడించిన తర్వాత రూట్ ఈ ఇద్దరి జోడీకి బ్రేక్ వేశాడు. భారీ షాట్ కు ప్రయత్నించి అండర్సన్ పట్టిన అద్భుతమైన క్యాచ్ కు పెవిలియన్ కు చేరాల్సి వచ్చింది. హైదరాబాద్ లో జరిగిన తొలి టెస్టులో ఓడిపోయిన భారత్.. ఆ తర్వాత వరుసగా వైజాగ్, రాజ్ కోట్ టెస్టుల్లో విజయం సాధించింది. ప్రస్తుతం జరుగుతున్న రాంచీ టెస్టులోను విజయం సాధిస్తే 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంటుంది.
ALSO READ : IND vs ENG 4th Test: నువ్వు హీరోవి కాదు.. సర్ఫరాజ్‌పై రోహిత్ ఆగ్రహం
ఈ టెస్ట్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ రూట్ (121) సెంచరీతో 353 పరుగులు చేసింది. ఆ తర్వాత భారత్ జురెల్ 90 పరుగులతో రాణించడంతో 307 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 145 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ ముందు 192 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
Nick Knight said "When pressure is on Rohit Sharma has responded again". [JioCinema] pic.twitter.com/VmLjO7Ug6W
— Johns. (@CricCrazyJohns) February 26, 2024