భారత స్టార్ బ్యాటర్, ముంబై ఇండియన్స్ మాజీ సారథి రోహిత్ శర్మ ఆ జట్టును వీడనున్నారని కథనాలు వస్తున్నాయి. హిట్‌మ్యాన్ ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారని సమాచారం. ఐపీఎల్ 2025 మెగా వేలంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అతని అడుగుజాడల్లోనే సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, జస్ప్రీత్ బుమ్రా వంటి వారు మరికొందరు ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభానికి ముందు హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా ప్రకటిస్తూ ముంబై యాజమాన్యం ఏకపక్ష నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై రోహిత్‌కు ముందే సమాచారం ఇచ్చినప్పటికీ.. ఫ్రాంచైజీ క్రికెట్ కనుక యాజమాన్య నిబంధనలకు లోబడే ఉండాలి. దీంతో అతను మిన్నకుండి పోయారని సమాచారం. అప్పటికే రిటెన్షన్ ప్రక్రియ ముగిసిపోవడం.. వేలం పూర్తవ్వడం కూడా అతని మౌనానికి కారణాలుగా తెలుస్తోంది. కానీ, రాబోవు సీజన్‌లో అతను ముంబైకి ఆడడం 100 శాతం జరగదని నివేదికలు వస్తున్నాయి. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ సైతం ఇదే వెల్లడించాడు.
CSKలో రోహిత్ శర్మ..?
రోహిత్.. వచ్చే సీజనలో చెన్నై సూపర్ కింగ్స్ చెంతకు చేరతాడని వాన్ అంచనా వేశారు. ఆ జట్టు పగ్గాలు చేపట్టి.. ధోని వారసత్వాన్ని కొనసాగిస్తాడని అభిప్రాయపడ్డారు. బీర్‌బైసెప్స్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ వాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ రోహిత్ ముంబైని వీడటానికి ఇష్టపడకపోతే, వచ్చే ఏడాది హార్దిక్ నుండి బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని మరో బాంబ్ పేల్చాడు. దీనిపై స్పష్టత రావాలంటే.. రిటెన్షన్ ప్రక్రియ ముగిసేవరకూ వేచి చుడాల్సిందే.
ప్రస్తుతానికి ముంబై ఓటములను కట్టిపెట్టి.. విజయాల దిశగా సాగుతోంది. మొదటి మూడు ఓటమిపాలైనా.. చివరగా ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది.
ముంబై ఇండియన్స్ తదుపరి షెడ్యూల్
- ఏప్రిల్ 14న.. చెన్నై సూపర్ కింగ్స్ తో
- ఏప్రిల్ 18న.. పంజాబ్ కింగ్స్ తో
- ఏప్రిల్ 22న.. రాజస్థాన్ రాయల్స్ తో
- ఏప్రిల్ 27న.. ఢిల్లీ క్యాపిటల్స్ తో
- ఏప్రిల్ 30న.. లక్నో సూపర్ జెయింట్స్ తో
- మే 03న.. కోల్‌కతా నైట్ రైడర్స్ తో
- మే 06న.. సన్‌రైజర్స్ హైదరాబాద్ తో
- మే 11న.. కోల్‌కతా నైట్ రైడర్స్ తో
- మే 17న.. లక్నో సూపర్ జెయింట్స్ తో