IND vs ENG: బుర్ర పని చేస్తుందా..? హర్షిత్ రాణా ఓవరాక్షన్‌పై రోహిత్ సీరియస్

IND vs ENG: బుర్ర పని చేస్తుందా..? హర్షిత్ రాణా ఓవరాక్షన్‌పై రోహిత్ సీరియస్

కటక్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఘానా విజయం సాధించిన సంగతి తెలిసిందే. కెప్టెన్ రోహిత్ శర్మ (90 బంతుల్లో 119: 12 ఫోర్లు, 7 సిక్సర్లు) సూపర్ సెంచరీతో భారత్ 4 వికెట్ల తేడాతో అలవోకగా నెగ్గింది. దీంతో మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో గెలుచుకుంది. రెండో వన్డేలో హైలెట్ అంతా హిట్ మ్యాన్ దే. కొంతకాలంగా ఫామ్ లో లేని రోహిత్ కటక్ వన్డేలో మునుపటి ఫామ్ ను ప్రదర్శించడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అయితే ఇదే మ్యాచ్ లో రోహిత్ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణాపై కోపం తెచ్చుకోవడం వైరల్ గా మారింది.

ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 32వ ఓవర్లో ఐదో బంతిని ప్రత్యర్థి కెప్టెన్ జోస్ బట్లర్ బౌలర్ హర్షిత్ రాణా బౌలింగ్ లో డిఫెన్స్ ఆడాడు. బట్లర్ క్రీజ్ ధాటి రావడంతో దగ్గరే పడిన బంతిని హర్షిత్ రాణా త్రో విసిరాడు. కీపర్ ఎక్కడ ఉన్నాడో చూసుకోకుండా అనవసరంగా త్రో విసిరితే అది ఓవర్ త్రో రూపంలో ఫోర్ వెళ్ళింది. దీంతో రోహిత్ కు కోపం వచ్చింది. రాణా వైపు సీరియస్ గా చూస్తూ దిమాగ్ కిధార్ హై తేరా (బుర్ర ఎక్కడ పెట్టుకున్నావ్) అని ఫైరయ్యాడు. దీంతో రాణా తలదించుకుని బౌలింగ్ వేయడానికి వెళ్ళాడు. రాణాను రోహిత్ అరుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ALSO READ | IND vs ENG: ఇది కదా రికార్డు అంటే: 73 సెకన్లలోనే ఓవర్ పూర్తి చేసిన జడేజా

అంతకముందు మొదట నాలుగు బంతులను డాట్ బాల్స్ గా వేసిన రాణా ఐదో బంతికి అనవసర త్రో విసిరి అత్యుత్సాహం చూపించాడు.  ఇక ఈ మ్యాచ్ లో మొత్తం 9 ఓవర్ల పాటు బౌలింగ్ చేసిన రాణా ఒక వికెట్ తీసుకొని 62 పరుగులు ఇచ్చాడు. ఇదే సిరీస్ లో తొలి వన్డేలో అరంగేట్రం చేసిన రాణా మూడు వికెట్లు తీసుకొని రాణించాడు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే  మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 49.5 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 44.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 308 పరుగులు చేసి గెలిచింది.