టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పాకిస్థాన్ వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ హిట్ మ్యాన్ పాకిస్థాన్ కు వెళ్లనున్నాడని సమాచారం. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్‌లో పాకిస్తాన్ నిర్వహించనుంది. టోర్నమెంట్‌కు యూఏఈ భారత్ ఆడే మ్యాచ్ లకు వేదిక కానుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ వేడుకలకు రోహిత్ పాల్గొనేందుకు వెళ్తున్నట్టు రిపోర్ట్స్ చెబుతున్నాయి.
ఫిబ్రవరి 16 లేదా 17న ఛాంపియన్స్ ట్రోఫీ గ్రాండ్ ఓపెనింగ్ వేడుకను నిర్వహించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు భావిస్తుంది. ఈ మెగా ఈవెంట్ కు కెప్టెన్లందరూ హాజరు కావాలని పిసిబి భావిస్తోందట. ఈ కారణంగానే రోహిత్ పాకిస్థాన్ వెళ్లనున్నట్టు తెలుస్తుంది. 1996 తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ తొలిసారి పాకిస్థాన్ వేదికగా జరగనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఎనిమిదేళ్ల తర్వాత మళ్ళీ జరగనుంది. ఈ టోర్నీకి పాకిస్థాన్ ఆతిధ్యమివ్వడం.. డిఫెండింగ్ ఛాంపియన్ కూడా పాకిస్థాన్ కావడంతో ఆ దేశానికి ఈ టోర్నీ ప్రత్యేకంగా మారనుంది.
ALSO READ | IND vs IRE: మంధాన, రావల్ మెరుపు సెంచరీలు.. వన్డేల్లో టీమిండియా అత్యధిక స్కోర్
ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 19 నుండి మార్చి 9 వరకు.. అంటే 19 రోజుల పాటు అభిమానులను అలరించనుంది. ఫిబ్రవరి 19న కరాచీ వేదికగా ఆతిథ్య పాకిస్థాన్ జట్టు.. ప్రారంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఈ టోర్నీలో భారత జట్టు.. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో తమ మొదటి మ్యాచ్ ఆడనుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్
ఫిబ్రవరి 19: పాకిస్థాన్ vs న్యూజిలాండ్ (నేషనల్ స్టేడియం, కరాచీ)
ఫిబ్రవరి 20: బంగ్లాదేశ్ vs ఇండియా (దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దుబాయ్)
ఫిబ్రవరి 21: ఆఫ్ఘనిస్తాన్ vs సౌతాఫ్రికా (నేషనల్ స్టేడియం, కరాచీ)
ఫిబ్రవరి 22: ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్ (గడాఫీ స్టేడియం, లాహోర్)
ఫిబ్రవరి 23: పాకిస్తాన్ vs ఇండియా (దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దుబాయ్)
ఫిబ్రవరి 24: బంగ్లాదేశ్ vs న్యూజిలాండ్ (రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి)
ఫిబ్రవరి 25: ఆస్ట్రేలియా vs సౌతాఫ్రికా (రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి)
ఫిబ్రవరి 26: ఆఫ్ఘనిస్తాన్ vs ఇంగ్లాండ్ (గడాఫీ స్టేడియం, లాహోర్)
ఫిబ్రవరి 27: పాకిస్థాన్ vs బంగ్లాదేశ్ (రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి)
ఫిబ్రవరి 28: ఆఫ్ఘనిస్తాన్ vs ఆస్ట్రేలియా (గడాఫీ స్టేడియం, లాహోర్)
మార్చి 1: దక్షిణాఫ్రికా vs ఇంగ్లాండ్ (నేషనల్ స్టేడియం, కరాచీ)
మార్చి 2: న్యూజిలాండ్ vs భారత్ (దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దుబాయ్)
మార్చి 4: సెమీ-ఫైనల్ 1 (దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దుబాయ్)
మార్చి 5:సెమీ-ఫైనల్ 2 (గడాఫీ స్టేడియం, లాహోర్)
మార్చి 9: ఫైనల్ (గడాఫీ స్టేడియం, లాహోర్)