సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ డారిల్ కల్లినన్.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేశారు. భారత కెప్టెన్ ఫిట్‌గా లేరని, అధిక బరువుతో ఉన్నారని విమర్శించారు. అంతేకాదు, టెస్ట్ క్రికెట్ ఆడే సత్తా హిట్‌మ్యాన్‌కు లేదని అన్నారు. భారత కెప్టెన్ ఫ్లాట్ వికెట్‌పై మాత్రమే ఆడగలడని.. అతనో "ఫ్లాట్ ట్రాక్ రౌడీ" అని అభివర్ణించారు.
"రోహిత్‌ని.. విరాట్‌తో పోల్చలేం. వారి శారీరక స్థితిలో తేడాను గమనించండి. రోహిత్ అధిక బరువుతో ఉన్నాడు. ఫిట్ గా లేనప్పుడు లాంగ్ టర్మ్ క్రికెటర్ అని ఎలా అనగలం. నాలుగు, ఐదు రోజుల టెస్ట్ క్రికెట్ ఆడేందుకు రోహిత్ సరితూగలేడు. సరైన ఫిజికల్ కండిషన్‌తో లేడు. భారత ఉపఖండ పిచ్ లతో పాటు ఫ్లాట్ వికెట్స్ మాత్రమే రోహిత్ ఆడగలడు. అతను 'ఫ్లాట్ ట్రాక్ రౌడీ'.."
ALSO READ | Steve Smith: ఆసీస్ స్టార్ బ్యాటర్‌కు కష్టకాలం.. 10 ఏళ్ళ తర్వాత తొలిసారి టాప్ 10 నుంచి ఔట్
"భారత కెప్టెన్ మిడిల్ ఆర్డర్‌లో ఆడుతున్నాడు. ఇది నాకు నచ్చలేదు. అతను ఓపెనర్. అతను ముందుండి జట్టును నడిపించాలి.." అని కల్లినన్ ఓ స్పోర్ట్స్ ఛానెల్ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.
ఫేలవ ప్రదర్శన
కల్లినన్ వ్యాఖ్యలు అంగీకరించదగినవి కానప్పటికీ.. ఏడాది కాలంగా హిట్‌మ్యాన్ దారుణంగా విఫలమవుతున్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్ట్‌ల సిరీస్‌లో దారుణంగా విఫలమైన రోహిత్.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ అదే వైఫల్యాన్ని కొనసాగిస్తున్నాడు. 6 & 5, 23 & 8, 2 & 52, 0 & 8, 18 & 11, 3 & 6.. చివరి ఆరు టెస్టుల్లో భారత కెప్టెన్ చేసిన పరుగులివి. సారథిగా జట్టును ముందుకు నడిపిస్తున్న హిట్‌మ్యాన్ పరుగుల వేటలో వెనుకబడి పోయాడు. ఈ క్రమంలోనే అతనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య శనివారం (డిసెంబర్ 14) నుంచి గబ్బా వేదికగా మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లోనైనా రోహిత్ శర్మ రాణించాల్సి ఉంది. లేదంటే అంతే సంగతులు.