17 ఏళ్ళ తర్వాత టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీమిండియా వేడుకలు ఆకాశాన్ని దాటేశాయి. 2013లో చివరిసారిగా ఐసీసీ ట్రోఫీ నెగ్గిన భారత్ కు మరో ఐసీసీ టైటిల్ నెగ్గడానికి 11 ఏళ్ళు పట్టింది. ఈ క్రమంలో ఎన్నో సార్లు నాకౌట్ కు వచ్చినా నిరాశ తప్పలేదు. అయితే ఎట్టకేలకు రోహిత్ శర్మ సారధ్యంలోని టీమిండియా టీ20 వరల్డ్ కప్ 2024 గెలిచి విశ్వ విజేతగా అవతరించింది. చాలా సంవత్సరాల తర్వాత ఐసీసీ ట్రోఫీ రావడంతో దేశంలో ఈ వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. బార్బడోస్ నుంచి ఢిల్లీ చేరుకున్న భారత క్రికెటర్లకు అభిమానుల నుంచి ఘనమైన స్వాగతం లభించింది.
ఐటీసీ మౌర్య హోటల్‌లో ప్రత్యేకంగా కేక్ కటింగ్ వేడుకను నిర్వహించింది. ఈ కార్యక్రమం తర్వాత ప్రధాని మోదీని భారత క్రికెటర్లు కలిశారు. ప్రధాని నరేంద్ర మోడీతో భారత క్రికెటర్ల సమావేశం ముగిసిన తర్వాత ఢిల్లీ నుంచి స్పెషల్ ఫ్లైట్‌లో వచ్చిన టీమిండియాకు ముంబై అభిమానులు కూడా ఘనంగా స్వాగతం పలికారు. నారిమన్ పాయింట్ నుంచి వాంఖడే స్టేడియం వరకు రెండు గంటల పాటు సాగిన విక్టరీ పరేడ్ ఫ్యాన్స్‌ను కట్టి పడేసింది. వేలాది మందితో మెరీనా తీరం నిండిపోవడంతో ట్రాఫిక్ ఎక్కడిక్కకడ నిలిచిపోయింది. రెండు గంటలు ఆలస్యంగా ఏడున్నరకు విక్టరీ పరేడ్ మొదలైంది.
టాప్‌పైన ఉన్న ప్రతీ ప్లేయర్ నలువైపులా తిరుగుతూ ఫ్యాన్స్‌కు అభివాదం చేశారు. ఈ తర్వాత టీమ్ మొత్తం వాంఖడేలోకి అడుగుపెట్టింది. స్టేడియంలో టీమ్ మొత్తం డ్యాన్స్‌లతో హోరెత్తించింది. హోటల్ దగ్గర బాంగ్రా నృత్యం చేసిన హార్దిక్, కోహ్లీ, సూర్య, అక్షర్ స్టేడియంలోనూ తమ డ్యాన్స్‌తో రెచ్చిపోయారు. ఓ సందర్భంలో స్టేడియంలో రెయిన్ డ్యాన్స్‌ను నిర్వహిస్తున్నట్లుగా అనిపించింది. వెంగాబాయ్స్, టు బ్రెజిల్, చక్ దే ఇండియా పాటలతో ఫ్యాన్స్ హుషారెత్తారు.
గురువారం (జూలై 5) ముంబైలో జరిగిన విజయోత్సవ వేడుకల తర్వాత టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రతిష్టాత్మక T20 ప్రపంచ కప్ ట్రోఫీని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో ఉంచాడు. కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 వరల్డ్ కప్ ట్రోఫీని బోర్డు ప్రధాన కార్యాలయానికి తీసుకొని వచ్చిన వీడియోని బీసీసీఐ తన ఎక్స్ లో పోస్ట్ చేసింది. ఇందులో అధ్యక్షుడు రోజర్ బిన్నీ, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, సెక్రటరీ జే షా ఉన్నారు.
📍 BCCI HQ#TeamIndia Captain Rohit Sharma with the latest addition to the prestigious collection 🏆#T20WorldCup | #Champions | @ImRo45 pic.twitter.com/QKQjMAygf2
— BCCI (@BCCI) July 5, 2024