టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వరల్డ్ కప్ లో అదరగొట్టేస్తున్నాడు. ఓ వైపు బ్యాటర్ గా, మరో వైపు కెప్టెన్ గా అంచనాలను అందుకుంటున్నాడు. ఇప్పటివరకు 6 మ్యాచ్ ల్లో 398 పరుగులు చేసిన రోహిత్.. ఆడిన ఆరు మ్యాచ్ ల్లో టీమిండియాకు విజయాలను అందించాడు. వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలో హిట్ మ్యాన్ ప్రదర్శనపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఈ విజయాలపై రోహిత్ సంతోషంగానే ఉన్నా.. బయట నుంచి వచ్చే వ్యాఖ్యలపై షాకింగ్ కామెంట్స్ చేసాడు.
తాను చెడ్డ కెప్టెన్‌గా అవడానికి ఒక్క మ్యాచ్ చాలని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డారు. బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడిన రోహిత్.. విలేఖరులకు తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చాడు. మనం ఎలాంటి ప్రయత్నం చేసినా అది జట్టు ప్రయోజనాల కోసమేనని.. ఒక చెడ్డ ఆటగాడిగా, కెప్టెన్‌గా మారడానికి ఒక్క మ్యాచ్ చాలన్నాడు. వరుసగా విజయాలు సాధిస్తున్నపుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే ఎప్పుడో ఒకప్పుడు పరాజయం ఎదురైనపుడు నేను కూడా బ్యాడ్ కెప్టెన్‌గా కనిపిస్తా. విమర్శలు, ట్రోల్స్ వస్తాయి. ఇప్పటికైతే జట్టు విజయం కోసం ఏం అవసరమనే దానిపైనే దృష్టిసారించా అని రోహిత్ చెప్పాడు.
Also Read :- భారత్-శ్రీలంక మ్యాచ్.. బాణసంచాకు నో చెప్పిన బీసీసీఐ సెక్రటరీ జైషా
"కొన్ని సమయాల్లో మైదానం అనూహ్యంగా మారి బౌలర్లకు ఎక్కువగా అనుకూలిస్తుంది. ప్రత్యర్థిని ఓడించడానికి టాప్ స్పెల్ ఒక్కటి చాలు. బౌలర్లు బంతిని సరైన ఏరియాలో వేస్తే ఆడటం కష్టం. బౌలర్లు, స్పిన్నర్లు, బ్యాటర్లకు ఇక్కడ ప్రతి ఒక్కరికీ అవకాశం ఉంటుంది" అని హిట్ మ్యాన్ చెప్పుకొచ్చాడు. కాగా.. ఆడిన 6 మ్యాచ్ ల్లో విజయం సాధించి దాదాపుగా సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్న భారత్.. నేడు శ్రీలంకపై జరగనున్న మ్యాచ్ లో విజయం సాధిస్తే సెమీస్ వెళ్లిన తొలి జట్టుగా నిలుస్తుంది.
I'll Suddenly Become A BAD CAPTAIN ?❤️?@ImRo45 pic.twitter.com/GQMUInqu7m
— Krishna (@sigmakrixhna) November 1, 2023