వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమి తర్వాత టీమిండియా ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కు సిద్ధమైంది. ఈ సిరీస్ లో రోహిత్, విరాట్ తో సహా పలు సీనియర్ ప్లేయర్లకు రెస్ట్ ఇచ్చారు. వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్య గాయపడంతో సూర్య కుమార్ యాదవ్ భారత జట్టుకు సారధ్యం వహించనున్నాడు. నవంబర్ 23 నుంచి ఈ సిరీస్ ప్రారంభమవుతుంది. ఇక వచ్చే ఏడాది వెస్టిండీస్, USAలలో T20 ప్రపంచ కప్ జరగనుండగా.. ఈ వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ కెప్టెన్ గా ఆడతాడా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఆస్ట్రేలియా వేదికగా 2022 లో జరిగిన టీ 20 ప్రపంచ కప్ లో రోహిత్ చివరిసారిగా ఆడాడు. రోహిత్ కెప్టెన్సీలో భారత్ సెమీ ఫైనల్ కు వెళ్లగా.. ఇంగ్లాండ్ పై ఓడింది. ఈ వరల్డ్ కప్ తర్వాత టీ20 లకు రోహిత్ ను సెలక్టర్లు పక్కన పెట్టేసారు. అప్పటి నుంచి హార్దిక్ పాండ్య నేతృత్వంలో భారత క్రికెట్ జట్టు టీ20 మ్యాచ్ లు ఆడుతూ వస్తుంది. రోహిత్ ను టీ20 కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే వస్తున్న సమాచార రోహిత్ టీ 20 కెప్టెన్సీకి సిద్ధంగా లేడని తెలుస్తుంది. టీ 20 లకు తన పేరు పరిశీలించకపోయిన పర్లేదు అని రోహిత్ సెలక్టర్లతో చెప్పాడంట.
ప్రస్తుతం రోహిత్ దృష్టాంతా దక్షిణాఫ్రికాపై టెస్టు సిరీస్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీపైనే ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో 2024 లో జరిగే టీ20 ప్రపంచ కప్ కు రోహిత్ ను కెప్టెన్ గా కొనసాగే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్ లో వైస్ కెప్టెన్ గా ఉంటున్న హార్దిక్ గాయం నుంచి ఎప్పుడు కోలుకుంటాడో చెప్పలేని పరిస్థితి. రిపోర్ట్స్ ప్రకారం పాండ్య జనవరి చివరి వరకు తన రీ ఎంట్రీ ఉండదని తెలుస్తుంది. అదే జరిగితే రాహుల్ తప్ప టీమిండియాకు మరో ఆప్షన్ లేదు. మరి 2024 లో జరగబోయే టీ20 కెప్టెన్ గా బీసీసీఐ ఎవరిని నియమిస్తుందో చూడాలి.