Crickek World Cup 2023: హీరోలా రోహిత్ శర్మ.. న్యూ లుక్ లో అదరగొడుతున్న ఇండియన్ కెప్టెన్

Crickek World Cup 2023: హీరోలా రోహిత్ శర్మ.. న్యూ లుక్ లో అదరగొడుతున్న ఇండియన్ కెప్టెన్

వరల్డ్ కప్ లో టీమిండియాకు తిరుగు లేకుండా పోతుంది. సొంతగడ్డపై అదరగొడుతూ వరుస విజయాలతో దూసుకెళ్తుంది. వరుసగా మూడు భారీ విజయాలను సొంతం చేసుకొని పాయింట్ల పట్టికలో టాప్ లో నిలిచింది. ఈ విజయాలతో అభిమానులు ఖుషీగా ఉంటే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఛిల్ల్ అవుతూ కనిపించాడు.
 
తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసిన లుక్ ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. బ్లాక్ కలర్ జాకెట్ లో కూలింగ్ గ్లాస్ పెట్టుకొని హీరోలా మారిపోయాడు. చాలా రోజుల తర్వాత రోహిత్ ఇలా సోషల్ మీడియాలో కనిపించడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇది చూసిన అభిమానులు లుక్ చాలా బాగుందని కామెంట్ చేస్తున్నారు.

కాగా.. వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాపై డకౌట్ గా వెనుదిరిగిన రోహిత్.. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచులో సెంచరీ చేసాడు. ఇక ఇటీవలే  చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై 58 బంతుల్లోనే 86 పరుగులు చేసి మ్యాచ్ గెలవడంతో కీలక పాత్ర పోషించాడు. ఇక ప్రస్తుతం పూణే చేరుకున్న భారత ఆటగాళ్లు అక్టోబర్ 19 న బాంగ్లాదేశ్ తో మ్యాచ్ ఆడాల్సి ఉంది.