ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన తొలి టీ20లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొహాలీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో మనోళ్లు గెలిచినా.. రోహిత్ రనౌట్ చర్చనీయాంశమైంది. ఫరూఖీ వేసిన మొదటి ఓవర్ తొలి బంతిని డిఫెన్స్ ఆడిన రోహిత్ పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. ఔటైన అనంతరం హిట్ మ్యాన్.. గిల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. సహజంగా కూల్ గా ఉండే రోహిత్ కు కోపం రావడంతో గిల్ ను ఏమైనా టార్గెట్ చేస్తాడేమో అనిపించింది. కానీ రోహిత్ ఇవేమి మనసులో పెట్టుకోలేదు.
క్రికెట్ లో ఇలాంటి విషయాలు జరుగుతాయని.. ఇలా జరిగినప్పుడు నిరుత్సాహానికి గురవ్వడం సహజమని రోహిత్ తెలిపాడు. మనం క్రీజ్ లో ఉన్నప్పుడు జట్టు కోసం పరుగులు చేయాలనుకుంటాం. కొన్నిసార్లు అనుకున్నది జరగదు. రనౌట్ విషయంలో ఇలాంటి పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. గిల్ ఆడిన సూపర్ ఇన్నింగ్స్ నన్ను ఆకట్టుకుంది. దురదృష్టవశాత్తు తక్కువ స్కోర్ కే ఔటయ్యాడు. అని రోహిత్ మ్యాచ్ అనంతరం పెజెంటేషన్ లో చెప్పుకొచ్చాడు.
Team India Skipper Rohit Sharma on the run-out
— SportsTiger (@The_SportsTiger) January 11, 2024
?: BCCI#TeamIndia #INDvAFG #AFGvIND #T20World #T20WorldCup2024 #T20WC2024 #ShubmanGill #RohitSharma #CricketWorld #IndianCricketTeam pic.twitter.com/iD2F3RP2zm
ఫరూఖీ వేసిన మొదటి ఓవర్ తొలి రెండో బంతిని రోహిత్ మిడ్- ఆఫ్ వైపుగా ఆడాడు. దీంతో హిట్‌మ్యాన్ సింగిల్ కోసం ప్రయత్నించగా గిల్ స్పందించలేదు. బాల్ వైపు చూస్తూ నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లోనే ఉండిపోయాడు. అదే సమయంలో మిడ్- ఆఫ్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న అఫ్ఘన్ కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ మెరుపువేగంతో బంతిని చేతికందుకొని కీపర్ కు వేయడంతో రోహిత్ డకౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది.సింగిల్ వస్తది కదా..! ఎందుకు రెస్పాండ్ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
గురువారం(జనవరి 11) జరిగిన తొలి టీ20లో ఇండియా 6 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్‌పై గెలిచింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో రోహిత్‌సేన 1–0 లీడ్‌లో నిలిచింది. టాస్ ఓడిన అఫ్గాన్ 20 ఓవర్లలో 158/5 స్కోరు చేసింది. మహ్మద్ నబీ (27 బాల్స్‌లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 42) టాప్ స్కోరర్. అజ్మతుల్లా ఒమర్‌జాయ్ (29), ఇబ్రహీం జద్రాన్ (25) ఫర్వాలేదనిపించారు. తర్వాత ఇండియా 17.3 ఓవర్లలో 159/4 స్కోరు చేసి గెలిచింది. టార్గెట్ ఛేజింగ్‌లో శివమ్ దూబె (40 బాల్స్‌లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 60 నాటౌట్) భారత్ ను విజయతీరాలకు చేర్చాడు. జితేష్ శర్మ (31) రాణించాడు.
Rohit sharma run out... #RohitSharma #Gill #INDvAFG #IndianCricket pic.twitter.com/1qFr1aG282
— cricket squad (@cricketsquad4) January 11, 2024