ఆఫ్ఘనిస్తాన్ తో మూడో టీ20లో కోహ్లీ డకౌటయ్యాడు. ఆడిన తొలి బంతికే అనవసర పుల్ షాట్ తో వికెట్ సమర్పించుకున్నాడు. ఫరీద్ అహ్మద్ వేసిన మూడో ఓవర్ నాలుగో బంతికి లాంగాఫ్ లో జద్రాన్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో టీ20 క్రికెట్ చరిత్రలో తొలిసారి గోల్డెన్ డక్ గా వెనుదిరగాల్సి వచ్చింది. సాధారణంగా భారీ ఇన్నింగ్స్ లు ఆడే కోహ్లీ డకౌట్ కావడం చాలా అరుదు. అయితే కోహ్లీ నిన్న ఔటైన తీరుపై విమర్శల వర్షం కురుస్తుంది. సీనియర్ బ్యాటర్ గా ఇన్నింగ్స్ నిర్మించాల్సిన కోహ్లీ.. ఒక పేలవ షాట్ కు ఔటవ్వడం ఎవరికీ నచ్చలేదు.
గ్రౌండ్ లోకి దిగితే కోహ్లీ డెడికేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బ్యాటింగ్, ఫీల్డింగ్ లో 100 శాతం ఎఫర్ట్ ఇస్తాడు. ఒక్క ఇన్నింగ్స్ లో విఫలమైనంత మాత్రాన ఈ స్టార్ బ్యాటర్ ను నిందించాల్సిన పని లేదు. కోహ్లీ గోల్డెన్ డకౌట్ విషయం గురించి రోహిత్ స్పందించాడు. కోహ్లీ ఔటైనా రోహిత్ వెనకేసుకొచ్చాడు. సహజంగా విరాట్ కోహ్లీ తొలి బంతికే ఇలాంటి షాట్ ఆడడని.. కానీ కోహ్లీ ఉద్దేశ్యం నాకు అర్ధం అయింది. జట్టు కోసం మొదటి బంతి నుంచే అటాకింగ్ గేమ్ ఆడాలనుకున్నాడని హిట్ మ్యాన్ అన్నాడు.
ఈ మ్యాచ్ లో కోహ్లీ డకౌటైనా అద్భుతమైన ఫీల్డింగ్ తో అదరగొట్టాడు. కీలకమైన 17 ఓవర్లో సిక్సర్ ను ఆపి భారత్ కు విలువైన 5 పరుగులు సేవ్ చేశాడు. వ్యక్తిగత కారణాల వలన మొదటి టీ20 ఆడని కోహ్లీ, రెండో టీ20లో 22 బంతుల్లో 29 పరుగులు చేసి టచ్ లోకి వచ్చాడు. ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ రెండో సూపర్ ఓవర్ లో విజయం సాధించింది. మ్యాచ్ లో ఇరు జట్లు 212 పరుగులు చేశాయి.
మ్యాచ్ లో ఇరు జట్లు 212 పరుగులు చేశాయి. తొలి సూపర్ ఓవర్లో అఫ్గాన్ 16 రన్స్ చేయగా.. ఇండియా కూడా 16 రన్స్ చేసింది. రెండో సూపర్ లో ఇండియా 5బాల్స్‌కు 11 రన్స్‌కు రెండు వికెట్లు (ఆలౌట్) కోల్పోయింది. 12 రన్స్ టార్గెట్ ఛేజింగ్ లో తొలి మూడు బంతులకు బిష్ణోయ్ నబీని, రహ్మనుల్లా గుర్బాజ్‌ను ఔట్ చేయడంతో అఫ్గాన్ ఒకే రన్ చేసి ఓడింది.