శనివారం(ఫిబ్రవరి 1) నమన్ అవార్డుల కార్యక్రమం ముంబయిలో ఘనంగా జరిగింది. గతేడాది అత్యుత్తమ ఆటతో అదరగొట్టిన ప్లేయర్లను బీసీసీఐ వార్షిక అవార్డులతో సత్కరించింది. మెన్స్, ఉమెన్స్ క్రికెటర్లు పాల్గొన్న ఈ అవార్డుల కార్యక్రమంలో మహిళా క్రికెటర్లు మెన్స్ క్రికెటర్లను చేసిన ప్రత్యేక చిట్‌చాట్‌లు ప్రాధాన ఆకర్షణగా నిలిచాయి. ఇందులో భాగంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో మహిళా క్రికెటర్ స్మృతి మంధాన అడిగిన ప్రశ్న ఒకటి వైరల్ గా మారుతుంది.
స్మృతి మంధాన మాట్లాడుతూ.. మీకున్న హాబీల్లో దేనినైనా సహచర క్రికెటర్లు ఆటపట్టించారా?’ అని అడిగింది. స్మృతి ప్రశ్నకు రోహిత్ స్పందిస్తూ ఇలా అన్నాడు. "నా టీం మేట్స్ నేను ఎప్పుడూ మర్చిపోతుంటా అని టీజ్ చేస్తుంటారు. అందులో ఎలాంటి నిజం లేదు. మర్చిపోవడం నా హాబీ కాదు. మరి వారు అలా ఎందుకు అంటారో నాకు తెలియదు. అదంతా రెండు దశాబ్దాల కిందట జరిగింది’’ అని సమాధానం ఇచ్చాడు.
ALSO READ | Virat Kohli: వివాదానికి పుల్ స్టాప్.. ఔటైన బంతిపై కోహ్లీ ఆటో గ్రాఫ్
స్మృతి వెంటనే హిట్ మ్యాన్ ను మరో ప్రశ్న అడుగుతుంది. "ఇప్పటి వరకు మీరు మర్చిపోయిన అతి పెద్ద విషయం ఏంటి అని అడుగుతుంది. దానికి రోహిత్ సమాధానం ఇస్తూ.. ‘‘నేను ఈ విషయం చెప్పడానికి సిద్ధంగా లేను. ఒకవేళ ఈ ప్రోగ్రామ్ ను మా వైఫ్ లైవ్ చూస్తే.. నేను ఈ విషయాన్ని చెప్పకపోవడమే బెటర్". అని నవ్వుతూ సమాధానమిస్తాడు. దీంతో నెటిజన్స్ రోహిత్ ఈ విషయాన్ని ఎందుకు దాస్తున్నాడో కనిపెట్టే ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఈ చాట్ ఎంతో సరదాగా అనిపించింది.
Smriti Mandhana on Rohit Sharma forgetting things. 🤣pic.twitter.com/N9iqcXMESc
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 1, 2025
అవార్డుల కార్యక్రమంలో లెజెండ్ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ ‘కల్నల్ సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్’ అవార్డును అందుకున్నాడు. బీసీసీఐ ఉత్తమ క్రికెటర్లుగా పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, స్మృతి మంధాన పాలి ఉమ్రిగర్ (బెస్ట్ క్రికెటర్) అవార్డులు అందుకున్నారు. .కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన అశ్విన్‌ను బీసీసీఐ ప్రత్యేక అవార్డుతో సత్కరించింది.2023–24 సీజన్‌కు గాను వివిధ కేటగిరీల్లో మొత్తం 26 అవార్డులు అందజేసింది. రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్‌లో అత్యధిక వికెట్లు తీసిన హైదరాబాద్ బౌలర్ తనయ్ త్యాగరాజన్‌కు మాధవ్‌రావు సింధియా అవార్డు లభించింది.
ఎలైట్ గ్రూప్‌లో ఈ అవార్డును సాయి కిశోర్ సొంతం చేసుకున్నాడు. ఎలైట్ గ్రూప్‌లో అత్యధిక రన్స్ చేసిన క్రికెటర్‌గా ఏపీకి చెందిన రికీ భుయ్ నిలిచాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ఇండియా మెన్, విమెన్ ప్లేయర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఢిల్లీ రంజీ మ్యాచ్‌లో పాల్గొన్న కారణంగా కోహ్లీ ఈ వేడుకకు రాలేకపోయాడు.