శ్రీలంకతో టీమిండియా వన్డే సిరీస్ కోల్పోయింది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా భారత్ 0-2 తేడాతో సిరీస్ చేజార్చుకుంది. దీంతో ఇండియాతో టీ20 సిరీస్ ఓటమికి శ్రీలంక ప్రతీకారం తీర్చుకుంది. అదే విధంగా 27 ఏళ్ల తర్వాత భారత్ పై సిరీస్ గెలిచి తమ చెత్త రికార్డ్ కు బ్రేక్ వేసుకున్నారు. బుధవారం (ఆగస్ట్ 7) జరిగిన మూడో వన్డేలో లంకేయులు 110 రన్స్ తేడాతో టీమిండియాను చిత్తు చేసి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకున్నారు. ఈ మ్యాచ్ ఓటమి తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు.
"స్పిన్నర్లను ఎదుర్కొవడంలో మా ఆటగాళ్లు తడబడ్డారు. ఈ విషయంపై మాకు ఎలాంటి ఆందోళన లేదు. సిరీస్‌లో మేము ఒత్తిడికి గురయ్యాము.కొంచెం ధైర్యంగా ఆడి ఉండాల్సింది. ముఖ్యంగా స్పిన్నర్లను అటాక్ చేయడంలో విఫలమయ్యాం. ప్రతీ మ్యాచ్‌లోనూ విజయం సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తాము. దురదృష్టవశాత్తు ఈ సిరీస్ మేము చెత్తగా ఆడాం. ఈ విజయానికి శ్రీలంక అర్హులు. సిరీస్ అంతటా మంచి ఆటతీరును కనబర్చిన వారికి క్రెడిట్ ఇవ్వాలి. తప్పు రిపీట్ కాకుండా ప్రయత్నిస్తాం". అని రోహిత్ అన్నాడు.
ఈ సందర్భంగా రోహిత్ కు ఒక వింత ప్రశ్న ఎదురైంది. పోస్ట్ ప్రెజెంటేషన్ వేడుకలో టీ20 వరల్డ్ కప్ విజయంతో భారత్ ఆత్మసంతృప్తి చెందిందా అని అడిగినప్పుడు రోహిత్ అలాంటి అవకాశం లేదని చెప్పాడు. "టీ20 వరల్డ్‌కప్ విజయంతో మేము రిలాక్స్ కాలేదు. ఇదో పెద్ద జోక్. ఇలాంటి వాటికి నా కెప్టెన్సీలో ఛాన్స్ ఉండదు. ఇలాంటి విషయాలను అసలు పాటించుకొను అని రోహిత్ చెప్పుకొచ్చాడు".
టాస్ గెలిచిన లంక 50 ఓవర్లలో 248/7 స్కోరు చేసింది. అవిష్క ఫెర్నాండో (96) తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నా రెండు కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. తర్వాత ఇండియా 26.1 ఓవర్లలోనే 138 రన్స్‌కే కుప్పకూలింది. దునిత్ వెల్లలాగే (5/27), మహేశ్ తీక్షణ (2/45), జెఫ్రీ వాండర్సే (2/34) చెలరేగడంతో.. బుధవారం జరిగిన ఆఖరిదైన మూడో వన్డేలోనూ లంకేయులు 110 రన్స్ తేడాతో టీమిండియాను చిత్తు చేశారు. రోహిత్ (30) టాప్ స్కోరర్. సుందర్ (30), కోహ్లీ (20) పోరాడి విఫలమయ్యారు. ఫెర్నాండోకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, దునిత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.
Team India Skipper Rohit Sharma after ODI series loss against Sri Lanka
— SportsTiger (@The_SportsTiger) August 7, 2024
📷: BCCI#INDvSL #SLvIND #ODICricket #Cricket #TeamIndia #CricketNews #RohitSharma pic.twitter.com/WmTkgD1FeV