టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ లో నలుగురు స్పిన్నర్లను ఎంపిక చేయడంలో రోహిత్ శర్మదే కీలక పాత్ర. దీంతో భారత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, సిరాజ్ ల రూపంలో ముగ్గరు స్పెషలిస్ట్ బౌలర్లతోనే స్క్వాడ్ ప్రకటించింది. అయితే అనూహ్యంగా నలుగురు స్పిన్నర్లను ఎంపిక చేయడం ఆశ్చర్యానికి గురి చేసింది. కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ తో పాటు ఆల్ రౌండర్లు అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా లను వరల్డ్ కప్ స్క్వాడ్ లో చేర్చారు. ఈ నిర్ణయంతో రోహిత్ శర్మపై విమర్శలు కూడా వచ్చాయి. ఇదే విషయాన్ని ప్రెస్ లో అడిగితే రోహిత్ ఈ ఇప్పుడే వెల్లడించను అని దాటేశాడు.
Also Read:అమ్మాయిలకు టెస్ట్.. ఇవ్వాళ నుంచి ఇండియా, సౌతాఫ్రికా టెస్టు మ్యాచ్
రోహిత్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని ఒప్పుకోక తప్పదు. అమెరికాలో బుమ్రా, సిరాజ్, అర్షదీప్ లాంటి ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగిన భారత్.. సూపర్ 8 లో సిరాజ్ ను పక్కన పెట్టి ప్రధాన అస్త్రం కుల్దీప్ ను బరిలోకి దించింది. సూపర్ 8 మ్యాచ్ లతో పాటు నాకౌట్ మ్యాచ్ లన్నీ వెస్టిండీస్ లోనే జరగనున్నాయి. విండీస్ లోని స్లో పిచ్ లు స్పిన్నర్లలకు అనుకూలిస్తాయి. రోహిత్ చేసిన ఈ ముందు చూపు ఆలోచన భారత విజయాలలో కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా గురువారం (జూన్ 27) ఇంగ్లాండ్ తో జరిగిన సెమీ ఫైనల్లో స్పిన్నర్లు ఇంగ్లాండ్ కు చుక్కలు చూపించారు.
Captain Rohit Sharma 🫡💙
— SportsTiger (@The_SportsTiger) June 27, 2024
📷: BCCI#T20WorldCup #TeamIndia #T20WorldCup2024 #T20WC2024 #BCCI #T20Cricket #RohitSharma pic.twitter.com/lfAA2s5YzK
అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా కలిసి 11 ఓవర్లు బౌలింగ్ చేసి 6 వికెట్లు పడగొట్టారు. కేవలం 5 ఎకనామితో 56 పరుగులు మాత్రమే ఇచ్చారు. అక్షర్,కుల్దీప్ చెరో మూడు వికెట్లు తీసుకోగా.. జడేజా పొదుపుగా బౌలింగ్ చేశాడు. అంతకముందు జరిగిన సూపర్ 8 మ్యాచ్ ల్లోనూ స్పిన్నర్లు అదరగొట్టారు. ఫైనల్లోనూ భారత్ ఇదే వ్యహంతో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. రోహిత్ తీసుకున్న నలుగురు స్పిన్నర్ల వ్యహం మొదట్లో విమర్శలకు గురి చేసినా.. ప్రస్తుతం అతడిపై ప్రశంసలు కురుస్తున్నాయి.
Now people got their answer why Rohit Sharma wanted 4 spinners. 😂😂 pic.twitter.com/Hn3m79kczA
— Aryan 🇮🇳 (@Iconic_Hitman) June 27, 2024