T20 World Cup 2024: నా ప్రైజ్ మనీ వారికి బోనస్‌గా ఇవ్వండి.. రూ. 5 కోట్లు వద్దనుకుంటున్న రోహిత్ శర్మ

T20 World Cup 2024: నా ప్రైజ్ మనీ వారికి బోనస్‌గా ఇవ్వండి.. రూ. 5 కోట్లు వద్దనుకుంటున్న రోహిత్ శర్మ

టీ20 వరల్డ్ కప్ 2024 టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన గొప్పతనాన్ని చాటుకున్నాడు. ప్రధాన కోచ్.. మాజీ భారత కెప్టెన్.. మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ బుధవారం (జూలై 10) మిగిలిన కోచింగ్ సిబ్బందితో సమానంగా తనకు ప్రైజ్ మనీ ఇవ్వాలని బీసీసీఐని రిక్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఒక అడుగు ముందుకేసి బీసీసీఐ తనకు ఇచ్చిన వరల్డ్ కప్ ప్రైజ్ మనీ రూ. 5 కోట్లు త్యాగం చేయడానికి సిద్ధమయ్యాడని తెలుస్తుంది. 

నివేదికల ప్రకారం సహాయక సిబ్బందికి లభించిన బోనస్‌పై రోహిత్ శర్మ అసంతృప్తిగా ఉన్నాడట. సహాయక సిబ్బందికి ఎక్కువ డబ్బు లభించాలనే ఉద్దేశ్యంతో అందరితో పాటు తనకు లభించిన రూ. 5 కోట్లు బోనస్ బహుమతిని సహాయక సిబ్బందికి ఇవ్వాలని కోరినట్టు సమాచారం. ఇదిలా ఉంటే బోనస్‌ను ఏ సహాయక సిబ్బందికి ఇవ్వాలనుకుంటున్నారో హిట్ మ్యాన్ ప్రత్యేకంగా చెప్పలేదు. 17 ఏళ్ళ తర్వాత టీమిండియాకు టీ20 వరల్డ్ కప్ అందించిన రోహిత్.. వ్యక్తిగతంగానూ మరోసారి తన మంచి తనాన్ని చాటుకొని అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. 

Also Read:పాకిస్తాన్ వెళ్లటానికి ఆసక్తి చూపని టీమిండియా

రోహిత్ కెప్టెన్సీలో భారత్ జట్టు టీ20 వరల్డ్ కప్ సాధించడంతో టీమిండియాకు బీసీసీఐ రూ. 125 కోట్ల ప్రైజ్ మనీ ప్రకటించారు. ఐసీసీ ప్రైజ్ మనీ రూ. 20 కోట్ల రూపాయలు కాగా.. బీసీసీఐ 6 రెట్లు ప్రైజ్ మనీని ప్రకటించి ఆశ్చర్యానికి గురి చేసింది.  రివార్డ్‌లో భాగంగా స్క్వాడ్  ని 15మంది సభ్యులతో పాటు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ ఒకొక్కరు రూ.5 కోట్లు అందుకున్నారు. ద్రావిడ్ కోచింగ్ స్టాఫ్ లో భాగమైన బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్‌లకు ఒక్కొక్కరికి రూ.2.5 కోట్లు దక్కాయి.