భారత్-పాకిస్థాన్ సమరం కోసం అందరూ ఎదురు చూస్తున్నట్టుగానే ఓపెనర్ శుభమన్ గిల్ వచ్చేసాడు. డెంగ్యూ ఫీవర్ తో గత కొన్ని రోజులుగా ఇబ్బందిపడుతున్న గిల్.. చాలా ఫాస్ట్ గా కోలుకొని పాక్ మ్యాచుతో వరల్డ్ కప్ లో తన తొలి మ్యాచ్ ఆడుతున్నాడు. ఈ విషయం అందరికీ సంతోషం కలిగించేదే అయినా రోహిత్ మాత్రం ఇషాన్ కిషాన్ ని తప్పిస్తున్నందుకు చాలా బాధపడ్డాడు.
టాస్ గెలిచిన తర్వాత రోహిత్ మాట్లాడుతూ " ఇషాన్ స్థానంలో గిల్ తిరిగి వచ్చాడు, దురదృష్టవశాత్తూ ఇషాన్ తప్పిపోవడం చాలా బాధగా ఉంది. అతడు జట్టు అవసరమున్న ప్రతిసారి ముందుకు వచ్చాడు. అయితే గిల్ ఈ ఏడాది చాలా గొప్ప ఫామ్ లో ఉన్నాడు. అహ్మదాబాద్ లో అతనికి చాలా గోప్ప రికార్డ్ ఉంది. దీంతో కిషాన్ ని పక్కన పెట్టక తప్పట్లేదు". అని విచారం వ్యక్తం చేసాడు. కిషన్ ప్రస్తుతం మంచి ఫామ్ లోనే ఉన్నాడు. ఆస్ట్రేలియా మీద వరల్డ్ కప్ లో తొలి మ్యాచ్ మినహాయిస్తే అవకాశం వచ్చినప్పుడల్లా మంచి ప్రదర్శన చేసి తనను తాను నిరూపించుకున్నాడు.
ఇదిలా ఉండగా.. గిల్ స్థానంలో కిషన్ వరల్డ్ కప్ లో మొదటి రెండు మ్యాచులాడాడు. ఆస్ట్రేలియాపై డకౌట్ కాగా.. ఆఫ్ఘనిస్థాన్ పై 44 పరుగులతో పర్వాలేదనిపించాడు. కిషన్ మిడిల్ ఆర్డర్ లో ఆడగల సామర్ధ్యం కూడా ఉంది. అలా ఆడించాలంటే అయ్యర్ ని పక్కన పెట్టాలి. వరల్డ్ కప్ లాంటి కీలక మ్యాచులో ఈ ప్రయోగం చేస్తే అసలుకే మోసం వస్తుందని భావించిన భారత యాజమాన్యం కిషన్ పై వేటు వేసింది .
ALSO READ : పొన్నాలను బీఆర్ఎస్ లోకి ఆహ్వానించిన మంత్రి కేటీఆర్
ఇక ఈ మ్యాచులో టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన పాకిస్థాన్ కి ఓపెనర్లు శుభారంభం అందించారు. మొదటి 7 ఓవర్లలో వికెట్లేమీ కోల్పోకుండా 37 పరుగులు చేసింది. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్(18) ఇమాముల్ హక్ (18) క్రీజ్ లో ఉన్నారు.