టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌లో విరాట్ ఉండాల్సిందే : రోహిత్ శర్మ

టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌లో విరాట్ ఉండాల్సిందే : రోహిత్ శర్మ
  • ఇదే విషయం జై షాకు చెప్పిన రోహిత్
  • మాజీ క్రికెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కీర్తి ఆజాద్‌‌‌‌‌‌‌‌ 

న్యూఢిల్లీ: ఈ ఏడాది జరిగే టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌లో పాల్గొనే ఇండియా టీమ్‌‌‌‌‌‌‌‌ నుంచి విరాట్ కోహ్లీని తప్పిస్తున్నారన్న వార్తలను మాజీ క్రికెటర్, 1983 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌ విన్నర్ కీర్తి ఆజాద్‌‌‌‌‌‌‌‌ కొట్టిపడేశాడు. ఈ మెగా టోర్నీలో ఎట్టి పరిస్థితుల్లో కోహ్లీ ఉండాల్సిందేని కెప్టెన్‌‌‌‌‌‌‌‌ రోహిత్ శర్మ బీసీసీఐ సెక్రటరీ జై షాకు స్పష్టం చేశాడని తెలిపాడు. జూన్‌‌‌‌‌‌‌‌లో వెస్టిండీస్, యూఎస్‌‌ఏ వేదికగా టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌ జరగనుంది.

అయితే, షార్ట్‌‌‌‌‌‌‌‌ ఫార్మాట్‌‌‌‌‌‌‌‌లో కోహ్లీ తన స్థాయిలో ఆడటం లేదన్న కారణంతో వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌కు సెలెక్టర్లు అతడిని ఎంపిక చేయడం లేదంటూ వార్తలు వచ్చాయి.  విరాట్‌‌‌‌‌‌‌‌ను టీమ్‌‌‌‌‌‌‌‌ నుంచి తప్పించే బాధ్యతను బీసీసీఐ సెక్రటరీ జైషా చీఫ్‌‌‌‌‌‌‌‌ సెలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అజిత్ అగార్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అప్పజెప్పాడని కూడా కథనాలు వెలువడ్డాయి. దీనిపై ‘ఎక్స్‌‌‌‌‌‌‌‌’లో కీర్తి ఆజాద్ స్పందించాడు.

‘జై షా సెలెక్టర్ కాదు. అలాంటప్పుడు టీ20 టీమ్‌‌‌‌‌‌‌‌లో విరాట్ కోహ్లీకి చోటు ఇవ్వకూడదని ఇతర సెలెక్టర్లతో మాట్లాడి వారిని ఒప్పించే బాధ్యతను అజిత్ అగార్కర్‌‌‌‌‌‌‌‌కు ఎందుకు ఇవ్వాలి? ఇందుకోసం అగార్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఈ నెల 15 వరకు గడువు ఇచ్చారు. కానీ,  దీనికి అజిత్ అగార్కర్ అంగీకరించలేదని, అతను ఇతర సెలెక్టర్లనూ ఒప్పించలేకపోయాడని తెలిసింది.  దాంతో జై షా.. రోహిత్ శర్మను కూడా అడిగాడు. కానీ, తమకు ఎట్టిపరిస్థితుల్లో విరాట్ కోహ్లీ అవసరం అందని రోహిత్ తేల్చిచెప్పాడు.  కోహ్లీ టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌ ఆడనున్నాడు. టీమ్‌‌‌‌‌‌‌‌ సెలెక్షన్‌‌‌‌‌‌‌‌ కంటే ముందే దీనిపై జట్టు అధికారిక ప్రకటన వెలువడనుంది’ అని ట్వీట్ చేశాడు.