ఆసీస్‌ వెళ్లేందుకు ఎదురుచూస్తున్నా

ఆసీస్‌ వెళ్లేందుకు ఎదురుచూస్తున్నా

రికవర్‌ అవుతున్నా

టీమిండియా బ్యాట్స్‌ మన్‌ రోహిత్‌ శర్మ

న్యూఢిల్లీ: ఐపీఎల్‌‌‌‌–13 ముగిసిన తర్వాత ఇండియన్‌‌‌‌ క్రికెట్‌‌‌‌లో అత్యంత చర్చనీయాంశం ఏదైనా ఉందంటే  అది రోహిత్‌‌‌‌ శర్మ ఇంజ్యూరీనే.  ఐపీఎల్‌‌‌‌ లీగ్‌‌‌‌ స్టేజ్‌‌‌‌లో హ్యామ్‌‌‌‌స్ట్రింగ్‌‌‌‌ ఇంజ్యూరీకి గురైన రోహిత్‌‌‌‌.. కొన్ని మ్యాచ్‌‌‌‌లకు దూరమయ్యాడు.  అదే టైమ్‌‌‌‌లో ఆస్ట్రేలియా టూర్‌‌‌‌కు టీమిండియాను ఎంపిక చేసిన సెలెక్టర్లు.. ఈ ముంబైకర్‌‌‌‌ను అన్ని ఫార్మాట్లకు పక్కనపెట్టారు. కానీ క్వాలిఫయర్‌‌‌‌–1తోపాటు ఫైనల్​ బరిలోకి దిగి అందరికీ షాకిచ్చాడు. ఆ తర్వాత రోహిత్​ను ఆసీస్​తో టెస్టులకు సెలెక్ట్​ చేశారు. దీంతో రోహిత్‌‌‌‌ గాయం విషయంలో గందరగోళం మొదలైంది. అసలు నిజంగానే గాయమైందా.. మరేదైనా దాచిపెడుతున్నారా అనే ఊహాగానాలు వచ్చాయి. వీటి అన్నింటికీ తెరదించుతూ .. తన ఇంజ్యూరీ గురించి రోహిత్‌‌‌‌ స్పందించాడు. ప్రస్తుతం నేషనల్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ అకాడమీ (ఎన్‌‌‌‌సీఏ)లో ట్రెయినింగ్‌‌‌‌లో ఉన్న అతను.. గాయం నుంచి రికవర్‌‌‌‌ అవుతున్నానని శనివారం చెప్పాడు. ఆసీస్​  సిరీస్​ కోసం ఎదురుచూస్తున్నానని తెలిపాడు. ‘నా ఇంజ్యూరీ విషయంలో జనం ఏదేదో మాట్లాడుతున్నారు.   అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. నేను మాత్రం ఇంజ్యూరీ అయినప్పటీ నుంచి ముంబై టీమ్‌‌‌‌, బీసీసీఐతో టచ్‌‌‌‌లోనే ఉన్నా.గాయం తగ్గకపోయినా, షార్ట్‌‌‌‌ ఫార్మాటే కాబట్టి  మేనేజ్‌‌‌‌ చేయగలననే ఉద్దేశంతో ముంబై మేనేజ్​మెంట్​కు చెప్పి ప్లేఆఫ్స్​లో ఆడా. ప్రస్తుతానికి హ్యామ్‌‌‌‌స్ట్రింగ్‌‌‌‌ (స్నాయువు) బాగానే ఉంది. కండరాలను బలంగా తయారు చేసి అధీనంలోకి తెచ్చుకునే ప్రాసెస్‌‌‌‌ను స్టార్ట్‌‌‌‌ చేశా. ఆసీస్‌‌‌‌తో టెస్ట్‌‌‌‌లు ఆడే సమయానికి నన్ను వేలెత్తి చూపే చాన్స్​ ఇవ్వకూడదని డిసైడయ్యా. దానికోసమే ఇప్పుడు ఎన్‌‌‌‌సీఏలో ఉన్నా.  ఇక రోహిత్‌‌‌‌ ఆస్ట్రేలియా వెళ్లగలడా లేడా అంటూ ఎవరో చేసిన కామెంట్స్‌‌‌‌ గురించి నేను పట్టించుకోను. గాయమైన తర్వాతి రెండ్రోజులు… అసలు సమస్య ఏంటి, రాబోయే పది రోజులు నేనేం చెయ్యాలి అనే వాటి గురించే ఆలోచించా. కానీ గాయం తీవ్రత రోజుకో రకంగా ఉండేది.  కండరాలు ఒక్కోసారి ఒక్కోలా రెస్పాండ్‌‌‌‌ అయ్యేవి. ఇప్పటికీ హ్యామ్‌‌‌‌స్ట్రింగ్‌‌‌‌ విషయంలో చాలా చెయ్యాల్సి ఉంది. అందుకే వైట్‌‌‌‌బాల్‌‌‌‌ సిరీస్‌‌‌‌ల కోసం ఆస్ట్రేలియా వెళ్లలేదు.   ఆసీస్‌‌‌‌ వెళ్లుంటే వన్డేలు, టీ20లు కలిపి 11 రోజుల్లో ఆరు మ్యాచ్‌‌‌‌లు ఆడాలి.  అదే ఓ 25 రోజులు శరీరంపై ఫోకస్‌‌‌‌ పెడితే టెస్ట్‌‌‌‌ సిరీస్‌‌‌‌కు  సిద్ధం కావచ్చని భావించా. కానీ ఈ విషయాన్ని ఎందుకింత రచ్చ చేస్తున్నారో అర్థం కావడం లేదు’ అని రోహిత్‌‌‌‌ చెప్పుకొచ్చాడు.

రాత్రికిరాత్రే ఏం జరగదు

ముంబై ఇండియన్స్‌‌‌‌ ఐదుసార్లు ఐపీఎల్‌‌‌‌ విజేతగా నిలిచిందంటే  దాని వెనుక ఎంతో శ్రమ ఉందని, రాత్రికిరాత్రే అంతా జరగలేదని  కెప్టెన్‌‌‌‌ రోహిత్‌‌‌‌ శర్మ అన్నాడు. అంతేకాక, కెరీర్‌‌‌‌ విషయంలో సూర్యకుమార్‌‌‌‌ యాదవ్‌‌‌‌ చాలా క్లారిటీతో ఉన్నాడని హిట్‌‌‌‌మ్యాన్‌‌‌‌ వెల్లడించాడు. ‘ముంబై ఎలా ఇంత సక్సెస్‌‌‌‌ సాధిస్తుందని ఎవరైనా ఆలోచించారా? మా టీమ్‌‌‌‌లో పొలార్డ్‌‌‌‌ ఉన్నాడు, హార్దిక్‌‌‌‌ పాండ్యా, జస్‌‌‌‌ప్రీత్‌‌‌‌ బుమ్రా ఉన్నారు.  అయినా, ఇది కాక రోహిత్‌‌‌‌ వేరే టీమ్‌‌‌‌తో కూడా ఇలా విజయాలు సాధించగలడా అనే ప్రశ్న చాలాసార్లు విన్నా. అసలు వేరే టీమ్స్‌‌‌‌తో నేనెందుకు విజయాలు సాధించాలో నాకు అర్ధం కాదు. మా  ఫ్రాంచైజీ ఓ పద్ధతిలో పని చేస్తోంది. ఓ ప్లేయర్‌‌‌‌గా, లీడర్‌‌‌‌గా నేనూ అదే విధానాన్ని ఫాలో అవుతా. రాత్రికిరాత్రే  టీమ్‌‌‌‌ ఇలా తయారవ్వలేదు. ఇష్టమొచ్చినట్టు జట్టును మార్చడానికి ముంబై  ఫ్రాంచైజీ వ్యతిరేకం కాబట్టే  అంతా సాధ్యమైంది. నాతోపాటు అందరినీ 2011 ఆక్షన్‌‌‌‌లో తీసుకుని ఓ టీమ్‌‌‌‌ను నిర్మించింది. కరోనా వల్ల ఎప్పుడు ఏం జరుగుతుందో  తెలియని సిచ్యువేషన్‌‌‌‌లో ముంబై మా కోసం మంచి వాతావరణం క్రియేట్‌‌‌‌ చేసింది. 80 రోజులు బయో బబుల్‌‌‌‌లో ఉన్నా ఇల్లు గుర్తు రాకుండా చూసుకుంది. ఇందుకోసం జూన్‌‌‌‌లోనే ప్రిపరేషన్స్‌‌‌‌ మొదలుపెట్టింది. నెట్‌‌‌‌ బౌలర్ల నుంచి ప్రతీ చిన్న విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంది. సూర్యకుమార్‌‌‌‌ యాదవ్‌‌‌‌ తన కెరీర్‌‌‌‌ విషయంలో చాలా క్లారిటీతో ఉన్నాడు. నేషనల్‌‌‌‌ సెలెక్షన్స్‌‌‌‌ జరిగిన రోజు మేమంతా మా టీమ్‌‌‌‌ రూమ్‌‌‌‌లోనే కలిసి ఉన్నాం.  సూర్య నిరాశలో ఉన్నాడని అర్థమైంది  అందుకే అతనితో మాట్లాడాలని ట్రై చేయలేదు. కానీ తనే చొరవ తీసుకుని ముందు మాట్లాడాడు. ఏం ఫర్వాలేదు, ముంబై కోసం మ్యాచ్‌‌‌‌లు గెలిపిస్తా అని చెప్పాడు. ఆ మాటలు విన్నాక… సూర్య తన కెరీర్‌‌‌‌ విషయంలో ఎంతో  క్లారిటీతో ఉన్నాడని,  సరైన దారిలో వెళుతున్నాడని అర్థమైంది. అతను ఇండియాకు ఆడే టైమ్‌‌‌‌ వస్తుంది’ అని రోహిత్‌‌‌‌ తెలిపాడు.

For More News..

బ్యాక్ టు ఇండియా.. వందేళ్ల కింద ఎత్తుకుపోయిన విగ్రహం

పేరుకే ఎంసెట్ స్పాట్ కౌన్సెలింగ్.. ఇష్టారాజ్యంగా అడ్మిషన్లు

ఆ మ్యాచ్ తర్వాత కోహ్లీ మెచ్చుకున్నడు