IND vs ENG: రోహిత్ శర్మ మెరుపు సెంచరీ.. కటక్ వన్డేలో విజయం దిశగా టీమిండియా

IND vs ENG: రోహిత్ శర్మ మెరుపు సెంచరీ.. కటక్ వన్డేలో విజయం దిశగా టీమిండియా

కటక్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మెరుపు సెంచరీతో అదరగొట్టాడు.  కటక్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో 76 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హిట్ మ్యాన్ ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. వన్డేల్లో  రోహిత్ కు ఇది 32వ సెంచరీ. రోహిత్ శర్మ వన్డే కెరీర్ లో ఇది రెండో ఫాస్టెస్ట్ సెంచరీ. గత కొంతకాలంగా ఫామ్ లేమితో ఇబ్బందిపడుతున్న రోహిత్.. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపెట్టాడు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతూ తనదైన శైలిలో బౌండరీల వర్షం కురిపించాడు.

ఆదిల్ రషీద్ బౌలింగ్ లో  లాంగాన్ దిశగా సిక్సర్ కొట్టి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రోహిత్ దూకుడుతో భారత్ రెండో వన్డేలో విజయం దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం 26 ఓవర్లలో 2 వికెట్లను 194 పరుగులు చేసింది. టీమిండియా గెలవాలంటే 24 ఓవర్లలో మరో 111 పరుగులు చేయాలి. రోహిత్ తో పాటు గిల్ (60) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఎన్నో అంచనాల మధ్య కోహ్లీ 5 పరుగులు చేసి విఫలమయ్యాడు. అంతకముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ తీసుకున్న ఇంగ్లాండ్.. బ్యాటర్లు అందరూ సమిష్టిగా రాణించడంతో 49.5  ఓవర్లలో 304 పరుగులకు ఆలౌట్ అయింది.