Cricket World Cup 2023: రోహిత్ శర్మ సిక్సుల రికార్డ్ : 47 దగ్గర ఔట్

Cricket World Cup 2023: రోహిత్ శర్మ సిక్సుల రికార్డ్ : 47 దగ్గర ఔట్

వరల్డ్ కప్ మ్యాచుల్లో రోహిత్ శర్మ బ్యాటింగ్ విధ్వంసం చేశాడు. న్యూజిలాండ్ తో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్ లో వీరోచితంగా ఆడుతూ ఔట్ అయ్యాడు మన కెప్టెన్. 162 స్ట్రయిక్ రేటుతో 29 బంతుల్లోనే 47 పరుగులు చేశాడు రోహిత్ శర్మ. కొట్టిన 47 పరుగుల్లో నాలుగు సిక్స్ లు, నాలుగు ఫోర్లు ఉండటం విశేషం. 

సెమీఫైనల్ మ్యాచ్ లో మరో రికార్డ్ సైతం రోహిత్ శర్మ పేరున క్రియేట్ అయ్యింది. వరల్డ్ కప్ మ్యాచుల్లో అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. గతంలో ఈ రికార్డ్ క్రిస్ గేల్ పేరుతో ఉంది. క్రిస్ గేల్ ఇప్పటి వరకు 49 సిక్సులు మాత్రమే కొట్టాడు. కివీస్ మ్యాచ్ లో 50వ సిక్స్ కొట్టి.. కొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు రోహిత్ శర్మ.

47 పరుగుల దగ్గర టిమ్ వేసిన బంతిని గాల్లోకి లేపిన రోహిత్ శర్మ.. కనేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రోహిత్ దూకుడు చూసి.. అందరూ సెంచరీ ఖాయం అనుకున్నారు.. అయితే హాఫ్ సెంచరీకి దగ్గరలో ఔట్ అవ్వటంతో నిరుత్సాహ పడ్డారు ఫ్యాన్స్.