
టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ నామస్మరణతో ఉప్పల్ స్టేడియం ఊగిపోయింది. బుధవారం రాత్రి జరిగిన సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మ్యాచ్‌కు అభిమానులు పోటెత్తారు. రోహిత్, సూర్యకుమార్, బుమ్రా వంటి టీమిండియా స్టార్లు సిటీకి రావడంతో 36, 171 మంది ఫ్యాన్స్‌తో స్టేడియం కిక్కిరిసింది.
రోహిత్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. తను కనిపించినప్పుడల్లా కేరింతలు కొట్టారు. ఆటకు ముందు పహల్గాంలో ఉగ్రదాడి మృతులకు సంతాపం ప్రకటిస్తూ ఇరు జట్ల ఆటగాళ్లు ఒక నిమిషం మౌనం పాటించారు. అభిమానులు కూడా నిల్చొని మౌనం పాటించారు. భారత్ మాతాకీ జై నినాదాలు చేశారు.