IND vs NZ Final: రోహిత్ శర్మ మెరుపు హాఫ్ సెంచరీ.. పవర్ ప్లే లో ఇండియాకు సూపర్ స్టార్ట్

IND vs NZ Final: రోహిత్ శర్మ మెరుపు హాఫ్ సెంచరీ.. పవర్ ప్లే లో ఇండియాకు సూపర్ స్టార్ట్

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అదరగొడుతున్నాడు. దుబాయ్ వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతున్న ఫైనల్లో మెరుపు హాఫ్ సెంచరీ చేశాడు. పవర్ ప్లే లో కివీస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ 41 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. హిట్ మ్యాన్ ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు.. 3 సిక్సర్లు ఉన్నాయి. రోహిత్ దూకుడుగా ఆడడంతో ఇండియా పవర్ ప్లే లో ఆధిపత్యం కొనసాగించింది.

ప్రస్తుతం ఇండియా 11 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 65 పరుగులు చేసింది.  రోహిత్ శర్మ (50), గిల్ (10) క్రీజ్ లో ఉన్నారు. భారత్ గెలవాలంటే 39  ఓవర్లలో మరో 186 పరుగులు చేయాలి. చేతిలో 10 వికెట్లు ఉండడంతో ఈ మ్యాచ్ లో ఇండియా విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తుంది. ఇన్నింగ్స్ రెండో బంతికే సిక్సర్ కొట్టి ఇన్నింగ్స్ ధాటిగా ఆరంభించిన రోహిత్.. 6 ఓవర్లో.. 8 ఓవర్లో చూడచక్కని సిక్సర్లు బాదాడు. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో పెద్దగా ఫామ్ లో ని రోహిత్ ఫైనల్లో హాఫ్ సెంచరీతో విమర్శకులకు సమాధానం చెప్పాడు. 

ALSO READ | IND vs NZ Final: సమిష్టిగా రాణించిన భారత బౌలర్లు.. న్యూజిలాండ్ డీసెంట్ టోటల్

అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ డారిల్ మిచెల్, బ్రేస్ వెల్ అద్భుతంగా రాణించడంతో న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 251 పరుగుల మోస్తరు స్కోర్ చేసింది.   మిడిల్ ఆర్డర్ బ్యాటర్ డారిల్ మిచెల్ 101 బంతుల్లో 63 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. బ్రేస్ వెల్ 51 పరుగులు చేసి చివర్లో మెరుపులు మెరిపించాడు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. జడేజా, షమీలకు ఒక వికెట్ దక్కింది.