ఐపీఎల్ చరిత్రలో రోహిత్ మరో రికార్డు

ఐపీఎల్ చరిత్రలో రోహిత్  మరో రికార్డు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( ఐపీఎల్ )లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో ఎమ్‌ఎస్ ధోనితో కలిసి రోహిత్ శర్మ చేరబోతున్నాడు. 249 గేమ్‌లతో ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా మ్యాచ్ లు ఆడిన రెండో ప్లేయర్ గా రోహిత్ ఉన్నాడు.

ఈ క్రమంలో గురువారం (ఏప్రిల్ 18) చండీగఢ్‌లోని ముల్లన్‌పూర్‌లోని మహారాజా యదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ (PBKS)తో ముంబై ఇండియన్స్ (MI) తలపడనుంది. ఈ మ్యాచ్ బరిలో రోహిత్ దిగితే.. ఐపీఎల్ లో 250 మ్యాచ్ లు ఆడిన రెండో క్రికెటర్ గా రోహిత్ రికార్డు నెలకొల్పనున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మాజీ కెప్టెన్ ధోనీ 256 మ్యాచ్‌లతో  రోహిత్ కంటే ముందు ఉన్నాడు. ప్రస్తుతం 249 IPL మ్యాచ్ లు ఆడిన ప్లేయర్లలో దినేష్ కార్తీక్‌తో కలిసి రోహిత్ రెండవ స్థానంలో ఉన్నాడు .

ఆడమ్ గిల్‌క్రిస్ట్ నాయకత్వంలో డెక్కన్ ఛార్జర్స్ (DC)తో రోహిత్ IPL కెరీర్‌ను ప్రారంభించాడు. 2008 నుండి 2010 వరకు డెక్కన్ ఛార్జర్స తరుపున 45 మ్యాచ్‌లు ఆడాడు. ఆ తర్వాత- ముంబై ఇండియన్స్ జట్టున రోహిత్ మొత్తం 244 గేమ్‌లు ఆడాడు.