IPL 2025: ఇది కదా కిక్ అంటే: నలుగురు అంతర్జాతీయ సారధులకు కెప్టెన్‌గా పాండ్య

IPL 2025: ఇది కదా కిక్ అంటే: నలుగురు అంతర్జాతీయ సారధులకు కెప్టెన్‌గా పాండ్య

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యకు అరుదైన అవకాశం లభించింది. అదేంటో కాదు అతను అంతర్జాతీయ కెప్టెన్ లకు కెప్టెన్సీ చేయనున్నాడు. ఈ సీజన్ ముంబై ఇండియన్స్ జట్టులో అంతర్జాతీయ స్థాయిలో కెప్టెన్సీ చేసిన నలుగురు ఆటగాళ్లు ఉన్నారు. రోహిత్ శర్మ ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ గా ఉన్నాడు. హిట్ మ్యాన్ రిటైర్మెంట్ ప్రకటించడంతో సూర్య కుమార్ భారత టీ20 జట్టుకు బుమ్రా గతంలో భారత జట్టుకు కెప్టెన్సీ చేసిన అనుభవం ఉంది. ప్రస్తుత భారత టెస్ట్ జట్టుకు వైస్ కెప్టెన్ కూడా. ఇక న్యూజిలాండ్ వైట్ బాల్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ 2025 ఐపీఎల్ సీజన్ లో ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడనున్నాడు. 

ఎంతో అనుభవం ఉన్నప్పటికీ ఈ నలుగురిని కాదని ముంబై ఇండియన్స్ యాజమాన్యం హార్దిక్ పాండ్యకు కెప్టెన్ గా ప్రకటించడం విశేషం. గత సీజన్ లో రోహిత్ స్థానంలో పాండ్య ముంబై సారధిగా ఎంపికయ్యాడు. ఇటీవలే పోడ్ కాస్ట్ లో మాట్లాడిన పాండ్య.. రోహిత్, సూర్య, బుమ్రా ఉన్న జట్టుకు కెప్టెన్సీ చేయడం నా అదృష్టం అని పాండ్య తెలిపాడు. రోహిత్ శర్మ టీ20 లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో అతని స్థానంలో హార్దిక్ పాండ్య భారత వైట్ బాల్ ఫార్మాట్ కు కెప్టెన్ అవుతాడని భావించారు. అయితే భవిష్యత్, ఫిట్ నెస్ దృష్టిలో పెట్టుకొని బీసీసీఐ టీ20 జట్టుకు సూర్య.. వన్డే జట్టుకు గిల్ ను వైస్ కెప్టెన్ గా ప్రకటించింది.

Also Read : దంచికొట్టిన రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం

ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కు వరుసగా రెండోసారి సారధిగా పాండ్య బాధ్యతలు స్వీకరించానున్నాడు. నిషేధం కారణంగా తొలి మ్యాచ్ కు అందుబాటులో ఉండడం లేదు. దీంతో పాండ్య స్థానంలో సూర్య కుమార్ యాదవ్ ముంబైగా పగ్గాలు చేపట్టనున్నాడు. రెండో మ్యాచ్ నుంచి పాండ్య కెప్టెన్ గా రంగంలోకి దిగబోతున్నాడు. ముంబై ఆదివారం (మార్చి 23) చెపాక్ వేదికగా పటిష్టమైన చెన్నై సూపర్ కింగ్స్ తో తలబడబోతుంది. ఈ మ్యాచ్ లో పాండ్య ఆడడం లేదు. మార్చి 29న గుజరాత్ టైటాన్స్ తో అహ్మదాబాద్‌ వేదికగా జరగబోయే  మ్యాచ్ కు హార్దిక్ కెప్టెన్ బాధ్యతలు స్వీకరిస్తాడు.