Rohit Sharma: మా గెలుపు మంత్రం అదే.. ముంబై సీక్రెట్ రివీల్ చేసిన రోహిత్ శర్మ

Rohit Sharma: మా గెలుపు మంత్రం అదే.. ముంబై సీక్రెట్ రివీల్ చేసిన రోహిత్ శర్మ

ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ఎప్పటిలాగే ఓటమితోనే టోర్నీ ప్రారంభించింది. తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది. సీజన్ లో ముంబై తొలి మ్యాచ్ ఓడిపోవడం సహజం. శనివారం (మార్చి 29) హార్దిక్ సేన గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ కు సిద్ధమైంది. ఈ మ్యాచ్ లో గెలిచి టోర్నీలో బోణీ కొట్టాలని చేస్తుంది. తొలి మ్యాచ్ నిషేధం కారణంగా దూరమైన హార్దిక్ పాండ్య ఈ మ్యాచ్ లో బరిలోకి దిగుతున్నాడు. ఈ మ్యాచ్ కు ముందు ముంబై ఆత్మ విశ్వాసంతో కనిపిస్తుంది. ఆ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మ్యాచ్ కు ముందు మాట్లాడుతూ తమ జట్టు సీక్రెట్ చెప్పుకొచ్చాడు.

Also Read :- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై.. హార్దిక్ పాండ్య వచ్చేశాడు 

రోహిత్ మాట్లాడుతూ.. "నవ్వండి, అందరూ నవ్వండి, మనం ఓడిపోయినా, గెలిచినా, మనం నవ్వాలి, మనం నవ్వాలి. జట్టు సానుకూల దృక్పథాన్ని కొనసాగించడానికి.. ఎదురుదెబ్బల నుండి తిరిగి పుంజుకోవడానికి వీలు కల్పిస్తుంది. నవ్వడం చాలా సులభమైన వాక్యం.  కానీ దానికి చాలా అర్థం ఉంది. మనం గెలిచినా ఓడినా ఎల్లప్పుడూ ముందుకు సాగడం గురించి మాట్లాడుకుంటాము. ఎందుకంటే జీవితం ఇక్కడ ముగియదు. సూర్యుడు మళ్ళీ ఉదయిస్తాడు. మీరు మేల్కొని మరొక రోజు పోరాడటానికి మార్గాన్ని కనుగొంటారు."అని హిట్ మ్యాన్ తెలిపాడు. 

2024 సీజన్ లో రోహిత్ శర్మ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. హిట్ మ్యాన్ స్థానంలో హార్దిక్ పాండ్యకు జట్టు పగ్గాలు అప్పగించారు. ప్రస్తుతం రోహిత్ జట్టులో కేవలం ప్లేయర్ గానే కొనసాగుతున్నాడు. ఇక ఈ సీజన్ విషయానికి వస్తే చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చి డకౌటయ్యాడు. టీమిండియా తరపున బాగా ఆడే రోహిత్.. ఐపీఎల్ లో విఫలమవుతున్నాడు. అయితే విఫలమైనా తన మైండ్ సెట్ మారదని.. జట్టు కోసం దూకుడుగా ఆడతానని ఇటీవలే జరిగిన ఇంటర్వ్యూలో తెలిపాడు.