Rohit Sharma: బోరున ఏడ్చిన రోహిత్.. అందుకేనా..?

Rohit Sharma:  బోరున ఏడ్చిన రోహిత్..  అందుకేనా..?

ఇండియన్ కెప్టెన్ రోహిత్ శర్మ ఎప్పుడైనా కన్నీళ్లు పెట్టుకోవడం చూశారా..? ఏదైనా ఇంపార్టెంట్ సీరీస్ కోల్పోయినపుడు బాధగా కనిపించినా.. బోరున చిన్న పిల్లాడిలా ఏడవటం అయితే దాదాపు ఎప్పుడూ చూసుండరు. కానీ తాజాగా రోహిత్ బోరున ఏడవటం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా ధైర్యంగా కనిపించే హిట్ మాన్ కు ఏడ్చాల్సిన అవసరం ఏంటనుకుంటున్నారా..? అయితే చదవండి. 

హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు కార్లంటే చాలా ఇష్టం. అప్పుడప్పుడు ముంబైలో తన కారులో ప్రయాణిస్తూ కనిపిస్తాడు. రోహిత్ కార్ కలెక్షన్ ఎలా ఉంటుందో కూడా ఫ్యాన్స్ కు బాగా తెలుసు. అయితే రోహిత్‌ తన లాంబోర్గినీ  కారు కోసం చిన్నపిల్లాడిలా ఏడుస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఏంటి రోహిత్ ఏడవడం అని అందరూ షాక్ అవుతున్నారు. 

అయితే ఐపీఎల్ 18వ సీజన్ కోసం అడ్వర్టైజింగ్ కంపెనీలు తమ యాడ్స్ ను రెడీ చేస్తు్న్నాయి కదా. రోహిత్ కూడా ఐపీఎల్ యాడ్స్ కోసం ఏడవాల్సి వచ్చింది.  అంటే ఓ కంపెనీకి ప్రకటనలు ఇస్తున్న  రోహిత్ శర్మ ఏడ్చినట్లు నటించాల్సి వచ్చింది. ఏడుస్తూ నటించిన తన వీడియోను శనివారం ( మార్చి 15) రోజు ట్విట్టర్ (X ) లో షేర్ చేశాడు మన కెప్టెన్.

ALSO READ | IPL 2025 ఓపెనింగ్ సెర్మనీ.. ఈ సీజన్ మరింత గ్రాండ్గా..

డ్రీమ్ 11 కాంటెస్ట్ ప్రకారం రోహిత్ తన కారును IPL 2025 సీజన్ లో ఇవ్వాల్సి వస్తుంది. ఈ కాంటెస్ట్ ప్రకారం విన్నర్స్ రోహిత్ కారు లంబోర్గినీ 264  ను పొందే చాన్స్ ఉంది. సో తన కారును కోల్పోవాల్సి వస్తుంది కదా అని రోహిత్ ఏడ్చేశాడు ఆ యాడ్ లో. 

మరో వీడియోలో తన కారును అభిమానికి ఇచ్చేసి కామ్ గా ఆటోలో వెళ్లే వీడియో కూడా షేర్ చేశాడు. మీటర్ ఆన్ చేసి వెళ్లు.. మీటర్ ప్రకారం వెళ్లు.. అని ఆటోలో వెళ్తున్న వీడియో రిలీజ్ చేశాడు. అంటే కారు విన్నర్ కు ఇచ్చేసి ఆటోలో వెళ్తున్నట్లు ఈ యాడ్ లో చూపించారు. త్వరలో తనకు జరిగేది అదే అని ఇండైరెక్ట్ గా రోహిత్ చెప్పాడు.

అయితే తనకు ఇష్టమైన లంబోర్గిని కారు ఇస్తాడా. తన హైయెస్ట్ స్కోర్ 264 నెంబర్ ను కారు నెంబర్ గా ఎంచుకున్న హిట్ మాన్ అదే కారును ఇస్తాడా లేదా విన్నర్స్ కు వేరే కార్ ఇస్తారా అనేది ఇంకా క్లారిటీ లేదు. 4 కోట్ల రూపాయలకు పైగా ఉండే ఈ కారును కోల్పోతున్నానని యాడ్ లో నటించడం సోషల్ మీడియాలో కొంత బజ్ క్రియేట్ చేసింది.