ముంబై: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రంజీ మ్యాచ్‌లో ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. విరాట్ కోహ్లీ మాత్రం అందుబాటులో ఉండనని చెప్పాడు. ఈ మేరకు 23 నుంచి జమ్మూ కశ్మీర్‌తో జరిగే మ్యాచ్‌లో ముంబై తరఫునబరిలోకి దిగుతానని హిట్‌మ్యాన్ శనివారం ప్రకటించాడు. కానీ అదే రోజు సౌరాష్ట్రతో ఢిల్లీ ఆడే మ్యాచ్‌లో కోహ్లీ ఆడటం లేదని డీడీసీఏ వెల్లడించింది. మెడ నొప్పికి విశ్రాంతి తీసుకోవాలని కోహ్లీకి డాక్టర్లు సూచించారని తెలిపింది. రైల్వేస్‌తో జరిగే ఆఖరి మ్యాచ్‌లోనైనా విరాట్ ఆడతాడా? లేదా? అనే దానిపై స్పష్టత లేదు.
డొమెస్టిక్ క్రికెట్‌లో స్టార్ ప్లేయర్లు ఆడాలన్న డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో బిజీగా ఉన్న క్యాలెండర్ నుంచి కొంత సమయం తీసుకోవాల్సిన అవసరం ఉందని రోహిత్ స్పష్టం చేశాడు. రంజీ మ్యాచ్‌లను ఏ ప్లేయర్ కూడా తేలికగా తీసుకోకూడదన్నాడు. హిట్‌మ్యాన్ 2015లో యూపీతో చివరి రంజీ మ్యాచ్ ఆడాడు. మరోవైపు మోచేతి గాయం నుంచి కోలుకుంటున్న కేఎల్ కేఎల్ రాహుల్.. పంజాబ్‌తో కర్నాటక తలపడే మ్యాచ్‌లో ఆడే అవకాశాల్లేవు. హర్యానాతో జరిగే ఆఖరి మ్యాచ్‌లో రాహుల్ ఆడే చాన్స్ ఉంది.