మరి కొన్ని గంటల్లో టీమిండియా, పాకిస్తాన్ మధ్య హట్ ఫైట్కు తెరలేవబోతుంది. ఆసియాకప్ 2023లో భాగంగా భారత్ పాక్ మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్లో ఫేవరెట్గా భారత జట్టు ఆడనుందని ప్రపంచ క్రికెట్ అంచనా వేస్తుండగా..టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం పాకిస్తానే ఫేవరెట్ అంటున్నాడు.
గెలవడం కష్టమే..
పాకిస్తాన్పై భారత కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. పాకిస్తాన్ పర్ఫామెన్స్ అదుర్స్ అని కితాబిస్తున్నాడు. వన్డేలు, టీ20ల్లో పాక్ బాగా ఆడుతోందని చెప్తున్నాడు. నెంబర్ వన్ జట్టు అయ్యేందుకు బాబర్ సేన కష్టపడిందని..ఈ క్రమంలో పాకిస్తాన్పై గెలవడం అంత సులువు కాదంటున్నాడు. పాకిస్తాన్పై విజయం సాధించాలంటే కష్టపడాలని చెప్తున్నాడు.
వారి ఆట అదుర్స్..
పాక్ ఆట అసాధారణమైంది. పాకిస్తాన్ జట్టులోని ఆటగాళ్లంతా వన్డేలు, టీ20ల్లో రాణిస్తున్నారు. అందుకే ఆ జట్టు నెంబర్ వన్ అయింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్తో మ్యాచ్ మాకు మంచి సవాల్. ఆ జట్టుపై గెలవడం చాలా కష్టం. అయితే ఎలాగైనా గెలిచేందుకు శ్రమిస్తాం. ఫైనల్లో కూడా రెండు జట్లు ఆడుతాయని అనుకుంటున్నా...రోహిత్ శర్మ వెల్లడించాడు.
ఎలా ఆడాలో నాకు తెలుసు..
పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్లో ఓపెనర్గా జట్టుకు శుభారంభం అందించేందుకు ప్రయత్నిస్తా. ఎక్కువ సేపు క్రీజులో ఉండేందుకు ట్రై చేస్తా. నేను ఎప్పుడూ జట్టు కోసం మెరుగ్గా ఆడుతా. నేనెప్పుడూ టీమ్ గెలుపు కోసమే ఆడుతా. కొన్నేళ్లుగా నేను హై రిస్క్ అప్రోచ్‌తో బ్యాటింగ్ చేస్తున్న. పరిస్థితులకు తగ్గట్లు ఆడటం కూడా నాకు తెలుసు. మంచి రిథమ్‌లో ఉంటే ఔట్ కాను. టీ20ల్లో ఎలా ఆడినా కూడా.. వన్డేల్లో పరిస్థితులకు తగ్గట్లు ఆడాల్సి ఉంటుంది.
పాక్ బౌలర్లను ఎలా ఎదర్కొంటామంటే..
టీమిండియాలో షాహిన్ షా అఫ్రిది, నసీమ్ షా, హ్యారీస్ రౌఫ్ వంటి బౌలర్లు లేరు. నెట్స్‌లో వారి బౌలింగ్ కూడా ఎదుర్కొలేదు. అయితే అందుబాటులో ఉన్నవారితో ప్రాక్టీస్ చేశాం. వాళ్లు కూడా నాణ్యమైన బౌలర్లే. పాక్ బౌలర్లకు తమ అనుభవమే సమాధానం...అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.