
మూడో రోజు ఆటలో రోహిత్, సర్ఫరాజ్ మధ్య ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో కుల్దీప్ బౌలింగ్‌లో సర్ఫరాజ్ హెల్మెట్ లేకుండా క్లోజ్ ఇన్ పొజిషన్‌లో ఫీల్డింగ్ చేయడానికి వచ్చాడు. అయితే పక్కనే ఉన్న రోహిత్.. హీరో అవ్వాల్సిన అవసరం లేదు. హెల్మెట్ పెట్టుకో అంటూ అని తనదైన స్టయిల్లో వార్నింగ్ ఇచ్చాడు. వెంటనే సర్ఫరాజ్ డ్రెస్సింగ్ రూమ్ నుంచి హెల్మెట్ తెప్పించి పెట్టుకున్నాడు. ఈ వీడియో క్లిప్‌లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.