ముంబైలోని వాంఖడే వేదికగా ఏప్రిల్ 11 న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో దినేష్ కార్తీక్ మరోసారి తన బ్యాటింగ్ తో సత్తా చాటాడు. 23 బంతుల్లో 4 సిక్సులు, 5 ఫోర్లతో 53 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కార్తీక్ కొట్టిన కొన్ని ఇన్నోవేటివ్ షాట్స్ వావ్ అనిపించేలా ఉన్నాయి. కార్తీక్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రోహిత్ దగ్గరకు వచ్చి సరదాగా ఆట పట్టించాడు.
ఆ సమయంలో హిట్ మ్యాన్ అన్న మాటలు స్టంప్ మైక్‌లో రికార్డ్ అయ్యాయి. శెభాష్ కార్తీక్.. ప్రపంచకప్ ఆడేందుకే కదా ఇలా రెచ్చిపోతున్నావ్ అంటూ టీజ్ చేశాడు. కామెంటేటర్లు కూడా టీ20 వరల్డ్ కప్ 2024 జట్టులో చోటు కోసం కార్తీక్ పోటీ పడుతున్నట్లు అన్నారు. రోహిత్ సరదాగా అన్న మాటలను దినేష్ కార్తీక్ సీరియస్ గా తీసుకున్నట్టున్నాడు. సన్ రైజర్స్ తో నిన్న జరిగిన మ్యాచ్ లో అంతకుమించి అనే బ్యాటింగ్ తో వీర విహారం చేశాడు. అసాధారణ ఇన్నింగ్స్ ఆడి బెంగళూరు జట్టును గెలిపించడానికి చివరి వరకు ప్రయత్నించాడు.
మ్యాచ్ ఓడిపోయినా దినేశ్ కార్తీక్ (35 బాల్స్‌లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 83) ఇన్నింగ్స్ హైలెట్ గా నిలిచింది. దీంతో ఒక్కసారిగా టీ20 వరల్డ్ కప్ రేస్ లోకి వచ్చాడు. ఈ ఇన్నింగ్స్ తో నెటిజన్స్ కార్తీక్ ను వరల్డ్ కప్ కు ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే రిషబ్ పంత్, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, జితేష్ శర్మ, కేఎల్ రాహుల్ ఉంటే.. వారందరికీ ఈ వెటరన్ ప్లేయర్ ధీటుగా బదులిస్తున్నాడు.కార్తీక్ ఇదే ఫామ్ ను కొనసాగిస్తే టీ20 వరల్డ్ కప్ కు ఎంపికైన ఆశ్చర్యం లేదు. ఏప్రిల్ చివరి వారంలో భారత జట్టును ప్రకటించనున్నారు.
ఇప్పటివరకు దినేష్ కార్తీక్ చెన్నై తో జరిగిన తొలి మ్యాచ్ లో 26 బంతుల్లోనే 38* పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో 10 బంతుల్లోనే 28 పరుగులు చేసి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇక కేకేఆర్ పై 8 బంతుల్లోనే 20 పరుగులు.. నిన్న (ఏప్రిల్ 11) ముంబై ఇండియన్స్ పై 23 బంతుల్లో 53 పరుగులు.. తాజాగా సన్ రైజర్స్ పై 35 బాల్స్‌లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 83 పరుగులు చేసి సూపర్ ఫామ్ లో ఉన్నాడు.