IND vs AUS: రోహిత్ శర్మ ఔట్.. అంతలోనే బతికి పోయిన హిట్‌మ్యాన్

అడిలైడ్ టెస్ట్ లో రోహిత్ శర్మ ఆరో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చాడు. ఆడిన తొలి బంతికే తడబడ్డాడు. స్టార్క్ వేసిన ఈ బంతిని పుల్ షాట్ ఆడే క్రమంలో శరీరానికి తగిలింది. రెండో బంతిని స్టార్క్ మరింత పేస్ తో వేశాడు. హిట్ మ్యాన్ టైమింగ్ కుదరకపోవడంతో బంతి ప్యాడ్లకు తగిలింది. ఆసీస్ ఆటగాళ్లు అప్పీల్ చేయడంతో అంపైర్ ఔట్ గా ప్రకటించాడు. దీంతో ఇన్ సైడ్ ఎడ్జ్ అయిందని భావించిన  రోహిత్ వెంటనే రివ్యూకు వెళ్ళాడు. 

అంపైర్ నో బాల్ అని ప్రకటించడంతో రివ్యూకు వెళ్లే పని లేకుండా రోహిత్ శర్మ బతికిపోయాడు. అసలే పేలవ ఫామ్ తో ఉన్న రోహిత్ ఫ్యాన్స్ కు ఇది హార్ట్ బ్రేక్ కలిగినంత పని చేసింది. ఇదిలా ఉండగా వచ్చిన అవకాశాన్ని రోహిత్ ఉపయోగించుకోలేకపోయాడు. 6 పరుగులు చేసి కమ్మిన్స్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో భారత్ ఐదో వికెట్ కు కోల్పోయింది. ఈ సిరీస్ లో తొలి టెస్ట్ ఆడుతున్న హిట్ మ్యాన్.. రెండు ఇన్నింగ్స్ ల్లో నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్ లో 3 పరుగులే చేసి ఔట్ కాగా రెండో ఇన్నింగ్స్ లో 6 పరుగుల వద్ద ఔటయ్యాడు. 

ALSO READ : England Cricket: క్రికెట్‌ చరిత్రలో ఇంగ్లండ్ అరుదైన ఘనత .. 5 లక్షల పరుగులు చేసిన తొలి జట్టు

ఈ మ్యాచ్ విషయానికి వస్తే భారత్ పరాజయం దిశగా పయనిస్తోంది. రెండో ఇన్నింగ్స్ లో రెండో రోజు 5 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్ మరో 37 పరుగులు వెనకబడి ఉంది. క్రీజ్ లో నితీష్ రానా (11), రిషబ్ పంత్ (28) ఉన్నారు. ఆసీస్ బౌలర్ల ధాటికి ఏ ఒక్కరు కూడా 30 పరుగుల మార్క్ టచ్ చేయలేకపోయారు. బోలాండ్, కమ్మిన్స్ రెండు వికెట్లు తీసుకోగా.. స్టార్క్ ఒక వికెట్ పడగొట్టాడు.