ఐపీఎల్ వచ్చిందంటే దేశంలో పండగ వాతావరణం కురుస్తుంది. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ జట్టుకు ఈ మెగా లీగ్ లో భారీ ఫాలోయింగ్ ఉంది. దానికి ప్రధాన కారణం ఏంటని చెప్పాల్సి వస్తే ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ జట్టుకు సారథ్యం వహించడమే. అంబానీ ఉన్నా.. సచిన్ లాంటి ప్లేయర్లు గతంలో ముంబై ఇండియన్స్ తరపున ఆడినా రోహిత్ కెప్టెన్ గా ఎంట్రీ ఇచ్చాక ఆ జట్టు బ్రాండ్ వాల్యూ భారీగా పెరిగిపోయింది.
2013లో రికీ పాంటింగ్ తర్వాత రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ సారధ్య బాధ్యతలు తీసుకున్నాడు. 10 ఏళ్ళ నుంచి ముంబైని తిరుగులేని జట్టుగా నిలబెట్టి ఐపీఎల్ లో బెస్ట్ కెప్టెన్ గా నిలిచాడు. అయితే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ముంబై యాజమాన్యం రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాకు బాధ్యతలు అప్పగించింది. అంతర్గతంగా ఏం జరిగిందో తెలియదు గాని ఫ్యాన్స్ మాత్రం ఉద్దేశ్యపూర్వకంగానే రోహిత్ ను తప్పించారని విమర్శలు చేస్తున్నారు.
పాండ్యను కెప్టెన్ గా చేయడంతో రోహిత్ శర్మ అసంతృప్తిగా ఉన్నట్టు రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ కోచింగ్ ప్యానెల్‌కు తెలియజేసారని వార్తలొచ్చాయి. దీంతో ముంబై ఇండియన్స్ డ్రెస్సింగ్ రూమ్ లో వాతావరం గందరగోళంగా ఉన్నట్లు సమాచారం. దీనికి తోడు రోహిత్ శర్మ నిన్న (మే 17) లక్నోతో జరిగిన మ్యాచ్ తర్వాత నీతా అంబానీతో చాలా సేపు మాట్లాడడం వైరల్ గా మారుతుంది. వారు ఏం మాట్లాడుకున్నారో తెలియకపోయినా రోహిత్ జట్టులోని పరిస్థితులు వివరిస్తున్నట్టు.. అంబానీ హిట్ మ్యాన్ ను జట్టులో ఉండాల్సిందిగా కోరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఈ టోర్నీ ప్రారంభంలో రాణించిన రోహిత్ శర్మ తర్వాత దారుణంగా విఫలమయ్యాడు. అయితే శుక్రవారం (మే 17) లక్నోతో జరిగిన మ్యాచ్ లో మెరుపు హాఫ్ సెంచరీతో రాణించాడు. 38 బాల్స్‌లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 68 పరుగులు చేసి ఫామ్ లోకి వచ్చాడు. లీగ్ తొలి దశలో చెన్నై సూపర్ కింగ్స్ పై సెంచరీ చేసి సత్తా చాటిన రోహిత్ లక్నోతో హాఫ్ సెంచరీతో రాణించాడు.
ముంబై ఇండియన్స్ తరపున 158 మ్యాచ్‌లకు రోహిత్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అందులో 87 మ్యాచుల్లో ముంబై విజయం సాధించగా 67 మ్యాచుల్లో ఓడిపోయింది. హిట్ మ్యాన్ విజయాల శాతం 55.06. రోహిత్ తన కెప్టెన్సీతో ముంబై ఇండియన్స్ ను ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిపాడు. 2013, 2015, 2017, 2019, 2020 సంవత్సరాలలో ముంబై ఐపీఎల్ టైటిల్స్ గెలుచుకుంది.
Is Nita Ambani requesting Rohit Sharma to stay back in Mumbai Indians?#RohitSharma | #MumbaiIndians pic.twitter.com/DP59HFueWd
— Indian Cricket Team (Parody) (@ictparody) May 17, 2024