రోహిత్ చేయి..నా భుజంపైనే ఉంటుంది : హార్దిక్ పాండ్యా

రోహిత్ చేయి..నా భుజంపైనే ఉంటుంది : హార్దిక్ పాండ్యా

ముంబై :  ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ 17వ సీజన్‌‌‌‌‌‌‌‌లో ముంబై ఇండియన్స్‌‌‌‌‌‌‌‌ మాజీ కెప్టెన్‌‌‌‌‌‌‌‌ రోహిత్ శర్మ తనకు మార్గదర్శిగా ఉంటాడని ఆ టీమ్ కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా అంటున్నాడు. ముంబైకి ఐదు టైటిళ్లు అందించిన రోహిత్‌‌‌‌‌‌‌‌ స్థానంలో  తనను కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా ఎంపిక చేయడంపై అభిమానులు విమర్శలు వస్తున్న నేపథ్యంలో పాండ్యా ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘నాకు సాయం చేయడానికి రోహిత్‌‌‌‌‌‌‌‌ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాడు. ముంబై సాధించిన సక్సెస్‌‌‌‌‌‌‌‌ రోహిత్ నాయకత్వంలోనే వచ్చింది. 

ఇకపై రోహిత్ సక్సెస్‌‌‌‌‌‌‌‌ను నేను ముందుకు తీసుకెళ్లాలి. కెప్టెన్సీ మార్పు అంత ఇబ్బందికరంగానో, భిన్నంగానో ఉంటుందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే మేము పదేండ్లుగా కలిసి ఆడుతున్నాం. నా కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొత్తం అతని నాయకత్వంలోనే ఆడాను. కాబట్టి ఈ సీజన్‌‌‌‌‌‌‌‌ మొత్తం రోహిత్ చేయి నా భుజంపై ఉటుంది. నాకు అవసరమైనపప్పుడు తగిన  సాయం చేస్తాడు’ అని సోమవారం మీడియా సమావేశంలో పాండ్యా చెప్పుకొచ్చాడు. ఇక, తాను గుజరాత్ కెప్టెన్సీని వదులుకొని రోహిత్ స్థానంలో ముంబై పగ్గాలు చేపట్టడాన్ని ఓ వర్గం ఫ్యాన్స్  జీర్ణించుకోవడం లేదని  పాండ్యా అంగీకరించాడు.