IND vs NZ: గిల్‌ను వెనక్కి పిలిచిన రోహిత్.. అసలు కారణం ఇదే

IND vs NZ: గిల్‌ను వెనక్కి పిలిచిన రోహిత్.. అసలు కారణం ఇదే

వరల్డ్ కప్ లో భాగంగా ఇండియన్ ఓపెనర్ శుభమన్ గిల్ అద్భుతంగా ఆడాడు. 66 బంతుల్లో 80 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఓపెనర్ గా వచ్చిన గిల్.. మధ్యలో రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. వ్యక్తిగత స్కోర్ 79 పరుగుల వద్ద గిల్ కాలి కండరాలు పట్టేయడంతో అతడు బ్యాటింగ్ కొనసాగించలేకపోయాడు. దీంతో రిటైర్డ్ హర్ట్‌గా తప్పుకున్నాడు. అతని స్థానంలోశ్రేయాస్ అయ్యర్ క్రీజులోకి వచ్చాడు.అయితే గిల్ మైదానం నుంచి వెనక్కి పిలిచింది కెప్టెన్ రోహిత్ శర్మనే కావడం గమనార్హం. 
 
గిల్ కాలు కండరాలు పట్టేయడంతో అశ్విన్ తో చెప్పి గిల్ ను వచ్చేయమని రోహిత్ సంకేతాలు ఇచ్చాడు. దీనికి కారణం కూడా లేకపోలేదు. బ్యాటింగ్ చేయడానికి ఇబ్బందిపడుతున్న గిల్.. కష్టంగా బ్యాటింగ్ కొనసాగిస్తే గాయం అయ్యే ప్రమాదం ఉంది. గిల్ రిటైర్డ్ హార్ట్ అయ్యే సమయానికి టీమిండియా పటిష్ట స్థితిలో ఉందని భావించిన రోహిత్.. ఫైనల్ కు గిల్ ను ఆడించాలనే ఉద్దేశ్యంలో ఎలాంటి రిస్క్ తీసుకోలేదు. గిల్ లాంటి ఫామ్ లో ఉన్న ప్లేయర్ వరల్డ్ కప్ ఫైనల్ ఆడటం చాలా కీలకం.  గిల్ సెంచరీ కన్నా జట్టు ప్రయోజనాలే ముఖ్యం అని భావించి రోహిత్ ఇలా చేసి ఉంటాడని తెలుస్తుంది.

 ఇక ఈ మ్యాచ్ లో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 397 పరుగులు చేశారు. కోహ్లీ 117 పరుగులు, అయ్యర్ 105 పరుగులు చేసి సెంచరీల మోత మోగించారు. ఓపెనర్ గిల్ 80 పరుగులు చేయడంతో పాటు మరో ఓపెనర్ రోహిత్ 47 పరుగులు చేసి రాణించారు. చివర్లో రాహుల్ 20 బంతుల్లోనే 39 పరుగులు చేసాడు. న్యూజిలాండ్ బౌలర్లలో సౌథీ 3, బౌల్ట్ ఒక వికెట్ తీసుకున్నారు.