T20 World Cup 2024: 17 ఏళ్ళ తర్వాత టీ20 వరల్డ్ కప్.. రోహిత్ తల్లి ఎమోషనల్ పోస్ట్

T20 World Cup 2024: 17 ఏళ్ళ తర్వాత టీ20 వరల్డ్ కప్.. రోహిత్ తల్లి ఎమోషనల్ పోస్ట్

దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన 2007 టీ20 వరల్డ్ కప్ ధోనీ సారధ్యంలో టీమిండియా గెలుచుకుంది. ఉత్కంఠ భరితంగా జరిగిన ఫైనల్లో పాకిస్థాన్ పై 5 పరుగుల తేడాతో నెగ్గింది. ఈ వరల్డ్ కప్ తర్వాత టీమిండియాకు పొట్టి కప్పు గెలవడానికి 17 ఏళ్ళు పట్టింది. జట్టులో స్టార్ ఆటగాళ్లకు కొదువ లేకపోయినా ట్రోఫీ గెలవలేకపోయింది. 2014 లో తుది సమరానికి చేరుకున్నా.. ఫైనల్లో శ్రీలంకపై ఓడిపోయింది. అయితే రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ 2024 టీ20 వరల్డ్ కప్ గెలుచుకుంది. 

విండీస్ గడ్డపై దక్షిణాఫ్రికాపై జరిగిన ఫైనల్లో 7 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. భారత జట్టు వరల్డ్ కప్ గెలవడంతో టీమిండియా క్రికెటర్లు ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ చిన్న పిల్లాడిలా ఏడ్చేశాడు. ఫైనల్ గెలవగానే అంతర్జాతీయ టీ20 క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తన కొడుకు దేశానికి వరల్డ్ కప్ అందించడంతో రోహిత్ తల్లి సైతం ఎమోషల్ అయింది. సోషల్ మీడియా వేదికగా ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది.  

Also Read:ముంబైలో టీమిండియా విక్టరీ పరేడ్.. లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..?

రోహిత్‌, కోహ్లీ, తన మనుమరాలు ఉన్న ఫొటోను పంచుకున్నారు. "టీ20 క్రికెట్లో రోహిత్, కోహ్లీ ఇద్దరు దిగ్గజాలు. రోహిత్ భుజాలపై తన కూతురును మోస్తున్నాడు. వెనకాలే దేశం ఉంది. అతని పక్కన తన సోదరుడు ఉన్నాడు". అని రోహిత్, కోహ్లీ పక్క పక్కనే ఉన్న ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటోలో రోహిత్ తన కూతురిని భుజాలపై మోస్తున్నాడు. గురువారం (జూలై 4) భారత్ లో అడుగుపెట్టిన టీమిండియాకు  గ్రాండ్ వెల్కమ్ చెప్పారు అభిమానులు. గురువారం (జూలై 4) సాయంత్రం 5:00 గంటలకు వాంఖడే స్టేడియంలో బీసీసీఐ విక్టరీ పరేడ్‌ నిర్వహించనున్నారు.