
ఆస్ట్రేలియాపై జరిగిన 2024-25 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు పీడకలనే మిగిల్చింది. కెప్టెన్ గా, బ్యాటర్ గా హిట్ మ్యాన్ ఘోరంగా విఫలమయ్యాడు. తన స్థానం మార్చుకొని ఆరో స్థానంలో బ్యాటింగ్ చేసిన హిట్ మ్యాన్ తీవ్రంగా నిరాశపరిచాడు. మొదటి టెస్టుకు దూరమైన రోహిత్.. ఆ తర్వాత జరిగిన మూడు టెస్టుల్లో 5 ఇన్నింగ్స్ ల్లో కేవలం 31 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కెప్టెన్ గా రోహిత్ శర్మకు ఇదే అత్యంత చెత్త సిరీస్. రెండు, మూడు, నాలుగు టెస్టులాడిన రోహిత్ చివరి టెస్టుకు సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
బోర్డర్ గవాస్కర్ లో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన ఐదవ టెస్ట్ మ్యాచ్ నుండి తప్పుకోవడం ద్వారా వార్తల్లో నిలిచాడు. వ్యక్తిగత కారణాల వల్ల మొదటి టెస్ట్ మ్యాచ్‌కు దూరమైన రోహిత్, ఐదు ఇన్నింగ్స్‌లలో కేవలం 31 పరుగులు మాత్రమే చేయగలిగిన తర్వాత ఐదవ టెస్ట్ నుండి తప్పుకున్నాడు. ఫేలవ ఫామ్‌తో ఇబ్బంది పడిన టీమిండియా కెప్టెన్ తనకు తానుగా జట్టు నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్టు బుధవారం (ఏప్రిల్ 16) తెలిపాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో తాను పరుగులు చేయలేకపోయానని రోహిత్ అంగీకరించాడు
రోహిత్ శర్మ మాట్లాడుతూ.. " బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో నేను బంతిని సరిగా కొట్టలేకపోయాను. ఈ విషయాన్ని నేను నిజాయితీగా ఒప్పుకోవాలి. నేను ఫామ్ లో లేనని తెలిసి తుది జట్టు నుంచి తప్పుకోవాలని భావించా. మేము గిల్ ఆడాలని భావించాం. అంతకముందు జరిగిన మెల్బోర్న్ టెస్ట్ లో గిల్ ఆడలేకపోయాడు. కోచ్, సెలెక్టర్‌తో మాట్లాడి ఈ విషయం చెబితే చాలా వాదన జరిగింది. జట్టు కోసం నేను తీసుకున్న ఈ నిర్ణయం సరైనదే అని నేను భావిస్తున్నాను". అని అని రోహిత్ బియాండ్23 క్రికెట్ పాడ్‌కాస్ట్‌లో అన్నారు.
జనవరి 3 నుంచి ప్రారంభమైన ఈ టెస్టులో రోహిత్ శర్మ స్థానంలో యువ బ్యాటర్ శుభమాన్ గిల్ ప్లేయింగ్ 11 లో చోటు దక్కించుకున్నాడు. హిట్ మ్యాన్ స్థానంలో వచ్చిన గిల్ కూడా విఫలమయ్యాడు. రెండు ఇన్నింగ్స్‌లలో గిల్ 33 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సిరీస్ మొత్తం గిల్ ఐదు ఇన్నింగ్స్‌లలో 93 పరుగులు చేసి ఘోరంగా విఫలమయ్యాడు. ఈ టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ప్రస్తుతం రోహిత్ శర్మ ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతూ బిజీగా ఉన్నాడు. ముంబై తమ తదుపరి మ్యాచ్ గురువారం (ఏప్రిల్ 17) సన్ రైజర్స్ తో మ్యాచ్ ఆడబోతుంది.
Rohit Sharma: "I knew I had been out of form and wasn’t able to connect with the ballthat’s why I opted out."
— 𝐉𝐨𝐝 𝐈𝐧𝐬𝐚𝐧𝐞 (@jod_insane) April 16, 2025
Most secure guy 🥺. pic.twitter.com/f1BQFRlWvt