భారత్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ లో టీమిండియా అంచనాలకు తగ్గట్టు ఆడి ఫైనల్ కు చేరుకుంది. రేపు(నవంబర్ 19) టైటిల్ పోరులో ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మెగా టోర్నీలో ఆడిన 10 మ్యాచ్ ల్లో విజయం సాధించిన మన జట్టు వరల్డ్ కప్ ఫైనల్లో ఈజీగా గెలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు ఇండియన్ ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఐసీసీ ఈవెంట్లలో ఫైనల్ కు వచ్చిన ఇరు జట్ల కెప్టెన్లు మ్యాచ్ ముందు రోజు ఫోటో దిగుతారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఫైనల్ కు ముందు ఇరు జట్ల కెప్టెన్లు దిగిన ఫోటోలో ఒక కామన్ పాయింట్ ఉంది. అదేంటో కాదు ఎడమ వైపు ఎవరు నించుంటే వారికే ట్రోఫీ దక్కుతుంది. 2007 నుంచి పరిశీలిస్తే ట్రోఫీతో ఎడమ వైపు నించున్న కెప్టెన్ తమ జట్టుకు వరల్డ్ కప్ అందించాడు. 2007 లో ఆస్ట్రేలియా కెప్టెన్ పాంటింగ్, 2011లో భారత కెప్టెన్ ధోనీ, 2015లో ఆసీస్ కెప్టెన్ మైకేల్ క్లార్క్, 2019లో ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఎడమ వైపు నించున్నారు.
తాజాగా రోహిత్ శర్మ ట్రోఫీకి ఎడమ వైపు నించోని పోజ్ ఇవ్వడంతో సెంటిమెంట్ ప్రకారం ఈ సారి మనకే టైటిల్ వస్తుందని అభిమానులు భావిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక కొసమెరుపు ఉంది. ముందుగా రోహిత్ కుడి వైపు నించున్నాడు. కానీ అక్కడ ఉన్న మహిళ రోహిత్ ను ఎడమ వైపుకు పంపించింది. క్రికెట్ అభిమానులు ఇలాంటి సెంటిమెంట్ లను బాగా నమ్ముతారు. దీంతో మన జట్టుకు వరల్డ్ కప్ రావడం ఖాయమని బలంగా నమ్ముతున్నారు. ఈ క్రమంలో మరో సెంటి మెంట్ కూడా భారత్ కు అనుకూలంగా ఉంది.
— Out Of Context Cricket (@GemsOfCricket) November 18, 2023
2003 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియా ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా వరుసగా 10 మ్యాచ్ లు గెలిచి ఫైనల్ కు దూసుకెళ్లింది. మరో వైపు భారత్ 8 మ్యాచ్ ల్లో విజయం సాధించి ఫైనల్ కు వెళ్ళింది. ఫైనల్ టీమిండియాపై గెలిచి వరుసగా 11 మ్యాచుల్లో నెగ్గి విశ్వ విజేతగా నిలిచింది. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ టోర్నీలో కూడా భారత్ వరుసగా 10 విజయాలు సాధించి ఫైనల్ కు చేరుకుంది. మరి ఈ సెంటిమెంట్స్ ప్రకారం భారత్ ఫైనల్లో ఆస్ట్రేలియాపై వరల్డ్ కప్ గెలిచి అభిమానుల ఆశలను నెరవేరుస్తుందేమో చూడాలి.