టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టుల్లో తన పేలవ ఫామ్ కొనసాగిస్తున్నాడు. గత కొంతకాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న హిట్ మ్యాన్.. ప్రస్తుతం జరుగుతన్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో దారుణంగా విఫలమవుతున్నాడు. గబ్బాలో జరుగుతున్న మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో కేవలం 10 పరుగులకే ఔటయ్యాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన టీమిండియా కెప్టెన్.. కమ్మిన్స్ బౌలింగ్ లో ఆఫ్ సైడ్ డ్రైవ్ చేయబోయి వికెట్ కీపర్ క్యారీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
రోహిత్ ఔట్ కావడంతో తీవ్ర అసహనానికి గురయ్యాడు. గ్రౌండ్ నుంచి వెల్తూ డగౌట్ దగ్గరకు రాగానే అతను కోపంతో గ్లోవ్స్ విసిరికొట్టాడు. దీంతో రోహిత్ శర్మ రిటైర్మెంట్ అవుతాడనే ఊహాగానాలు వస్తున్నాయి. బ్యాటింగ్ తో పాటు రోహిత్ కెప్టెన్సీలోనూ విఫలమవుతున్నాడు. ఈ సిరీస్ లో తొలి టెస్టుకు దూరమైన రోహిత్.. అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో రెండు ఇన్నింగ్స్ ల్లో విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్ లో 3.. రెండో ఇన్నింగ్స్ లో 6 పరుగులు చేసి నిరాశపరిచాడు. ఏడాది కాలంగా టెస్టుల్లో రోహిత్ పేలవ ఆటతో భారత జట్టుకు భారంగా తయారయ్యాడు.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే నాలుగో రోజు లంచ్ తర్వాత భారత్ ప్రస్తుతం 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. క్రీజ్ లో జడేజా (60), సిరాజ్(0) ఉన్నాడు. భారత్ తొలి ఇన్నింగ్స్ లో మరో 249 పరుగులు వెనకబడి ఉంది. భారత్ ఫాలో ఆన్ తప్పించుకోవాలంటే మరో 49 పరుగులు చేయాల్సి ఉంది. నాలుగో రోజు రాహుల్ (82), జడేజా (60*) రాణించగా రోహిత్ శర్మ (10), నితీష్ కుమార్ (16) విఫలమయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో కమ్మిన్స్ మూడు వికెట్లు తీసుకున్నాడు. స్టార్క్ కు రెండు వికెట్లు దక్కాయి. లియాన్, హేజాల్ వుడ్ తలో వికెట్ పడగొట్టారు. అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 445 పరుగులకు ఆలౌట్ అయింది.
Rohit Sharma left his gloves in front of the dugout. Signs of retirement? pic.twitter.com/7aeC9qbvhT
— Div🦁 (@div_yumm) December 17, 2024