IPL 2024: టీమిండియాకు కలిసి రానున్న ముంబై, బెంగళూరు ఓటములు

IPL 2024: టీమిండియాకు కలిసి రానున్న ముంబై, బెంగళూరు ఓటములు

ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లు ప్లే ఆఫ్ అవకాశాలను దాదాపుగా కోల్పోయాయి. రెండు జట్లు కూడా టోర్నీలో పేలవ ప్రదర్శన చేస్తూ అన్ని జట్ల కంటే ముందుగానే నిష్క్రమించాయి. ఏదో మూల ఆశలు ఉన్నా అది సాధ్యం కాని  పనిలా కనిపిస్తుంది. రెండు జట్లు కూడా ఆడిన 10 మ్యాచ్ ల్లో 3 విజయాలు మాత్రమే సాధించి పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో నిలిచాయి.

ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న ఈ రెండు జట్లు ఐపీఎల్ ప్లే ఆఫ్ ఛాన్స్ లు కోల్పోవడం ఫ్యాన్స్ ను తీవ్ర నిరాశకు గురి చేస్తుంది. అయితే ఈ రెండు జట్లు త్వరగా వెళ్లిపోవడం టీమిండియాకు కలిసి వచ్చే అంశం. ఐపీఎల్ ఫైనల్ మే 26 తో ముగుస్తుంది. జూన్ 1 నుంచి టీ20 వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో ప్లే ఆఫ్ కు వెళ్లని జట్ల ఆటగాళ్లు మే 19 లేదా మే 20 న అమెరికాకు ప్రయాణమవుతారు. ఇప్పటికే ఆర్సీబీ, ముంబై ప్లే వెళ్లడం దాదాపు అసాధ్యం గనుక ఏ రెండు జట్లలో టీమిండియా స్టార్ ఆటగాళ్లు ఎక్కువ మంది ఉండడం విశేషం. 

ముంబై జట్టులో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్య ఉంటే.. బెంగళూరు జట్టులో కోహ్లీ, సిరాజ్ ఉన్నారు. ఈ ఆరుగురు టీమిండియాకు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా టోర్నీకి ముందు అన్ని టీమ్స్ పూర్తి స్క్వాడ్స్​తో రెండు వార్మప్ మ్యాచులు ఆడతాయి. అందుకే ఐపీఎల్ ప్లేఆఫ్స్ టైమ్​లోనే ఫస్ట్ బ్యాచ్ భారత ఆటగాళ్లు యూఎస్ వెళ్లనున్నారు. దీంతో మన స్టార్ ఆటగాళ్లకు కావాల్సినంత ప్రాక్టీస్ లభిస్తుంది. నాకౌట్స్‌లో ఆడే క్రికెటర్లు మే 27 లేదా 28వ తేదీన అమెరికాకు బయలుదేరే అవకాశం ఉంది.