కోనుగోలు చేసిన వడ్లను వెంట వెంటనే తరలించాలి : రోహిత్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌

జనగామ అర్బన్, వెలుగు : కొనుగోలు చేసిన వడ్లను వెంటవెంటనే తరలించాలని జనగామ అడిషనల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ రోహిత్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ ఆదేశించారు. జనగామ జిల్లాలోని రఘునాథపల్లి, ఖిలాషాపూర్, అశ్వరావుపల్లి గ్రామాల్లోని వడ్ల కొనుగోలు కేంద్రాలను మంగళవారం ఆయన తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా అడిషనల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు వచ్చిన రైతులను ఎలాంటి ఇబ్బందులు పెట్టొద్దని, అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలని సూచించారు. కొనుగోలు చేసిన వడ్ల వివరాలను ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో నమోదు చేయాలని చెప్పారు. డీఎస్‌‌‌‌‌‌‌‌వో రోజారాణి, సివిల్‌‌‌‌‌‌‌‌ సప్లై డీఎం ప్రసాద్, డీటీ శ్రీనివాస్, డీసీవో రాజేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఉన్నారు.