IND vs PAK: పాండ్య 200, కుల్దీప్ 300.. ఎడారి గడ్డపై రికార్డులే రికార్డులు

IND vs PAK: పాండ్య 200, కుల్దీప్ 300..  ఎడారి గడ్డపై రికార్డులే రికార్డులు

దుబాయి వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతోన్న మ్యాచ్‌‌ను భారత క్రికెటర్లు తమ రికార్డులకు అడ్డాగా మార్చుకున్నారు. ఈ మ్యాచ్‌లో నలుగురు భారత క్రికెటర్లు వారి వారి వ్యక్తిగత రికార్డులు తమ ఖాతాలో వేసుకున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనర్‌గా వన్డేల్లో 9వేల పరుగులు పూర్తి చేసుకోగా.. పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ వన్డేల్లో 14 వేల క్లబ్‌లో చేరాడు. 

అంతకుముందు బౌలింగ్ మరో ఇద్దరు భారత క్రికెటర్లు రికార్డులు సృష్టించారు. ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు పడగొట్టిన పాండ్యా.. అంతర్జాతీయ క్రికెట్‌లో 200 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. మరోవైపు, కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీయడంతో.. అతను అంతర్జాతీయ క్రికెట్‌లో 300 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. ఇలా పాక్ తో మ్యాచ్‌ను మనోళ్లు తమ రికార్డులకు ఆసరాగా చేసుకున్నారు.

  • రోహిత్ శర్మ: ఓపెనర్‌గా వన్డేల్లో 9 వేల పరుగులు
  • విరాట్ కోహ్లీ: వన్డేల్లో 14 వేల పరుగులు  
  • హార్దిక్ పాండ్యా: అంతర్జాతీయ క్రికెట్‌లో 200 వికెట్లు
  • కుల్దీప్ యాదవ్: అంతర్జాతీయ క్రికెట్‌లో 300 వికెట్లు