
దుబాయి వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి సెమీస్ వాడీవేడీగా జరుగుతోంది. చాలా సీరియస్‌గా మ్యాచ్ సాగుతోంది. ఆసీస్‌ను ఓడించి... 2023 వన్డే పపంచకప్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలన్న కసి భారత క్రికెటర్లలో కనిపిస్తోంది. ఫీల్డింగ్‌లో ఏ చిన్న పొరపాట్లను మనోళ్లు సహించడం లేదు. అందుకు ఈ చిన్న ఘటన ప్రత్యక్ష ఉదాహరణ.
ఓవైపు మ్యాచ్ సీరియస్‌గా సాగుతుంటే, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అలసత్వం వహించాడు. బంతిని చేత్తో పట్టుకోకుండా.. వెనుక ఫీల్డర్ ఉన్నాడులే అన్నట్లు ఏమరపాటుగా తీసుకున్నాడు. అది తిట్లకు దారి తీసింది. కెప్టెన్ రోహిత్ సహా కోహ్లీ ఇద్దరూ అతనిపై నోరు పారేసుకున్నారు.
అసలేం జరిగిందంటే..?
కుల్దీప్ బౌలింగ్‌లో ఓ బంతిన స్మిత్ డీప్ మిడ్‌వికెట్ దిశగా ఆడాడు. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ వెంటనే బంతి చేతికందుకొని బౌలర్ వైపు విసిరాడు. ఆ సమయంలో కుల్దీప్ బంతిని చేత్తో పట్టుకోలేదు. వెనుకున్న ఫీల్డర్ కవర్ చేస్తాడులే అన్నట్లుగా ఏమరపాటుగా ఉన్నాడు. దాంతో, కోహ్లీకి చిర్రెత్తుకొచ్చింది. ఏకంగా బూతులు మాట్లాడాడు. మరోవైపు రోహిత్ సైతం కుల్దీప్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
— The European Lad (@TheEuropeanDadd) March 4, 2025